సినిమాల మీద ఇష్టంతో కానీ, విజయాలు సాధించి ఫాన్స్‌ని ఖుషీ చేయాలనే ఉద్దేశంతో కానీ పవన్‌కళ్యాణ్ మళ్లీ నటించడం లేదనేది అందరికీ తెలుసు. పార్టీని, ఫ్యామిలీని పోషించడానికే సినిమాలు చేస్తున్నట్టు పవన్ పేర్కొన్నాడు. ఇలాంటి ఐడియాలజీతో వచ్చి కళారంగంలో ఎవరైనా ఏమి చేస్తారు? పవన్ కళ్యాణ్ తన సినిమాలని సీరియస్‌గా తీసుకోవడం మానేసి చాలా కాలమయింది. మధ్యలో దర్శకుల కారణంగా గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది వచ్చాయి కానీ లేదంటే జానీ తర్వాత పవన్ ప్యాషన్ చల్లబడిపోయింది.
ఇక డబ్బు కోసమే సినిమాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్ షూటింగ్ చేయడానికి తగినంత సమయం కేటాయించడం లేదు. కానీ తనకున్న క్రేజ్ క్యాష్ చేసుకోవాలని కొందరు నిర్మాతలు ఎగబడుతున్నారు. నిర్మాతలు కూడా ప్యాషన్‌తో కాకుండా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే పవన్‌ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ రెండు సినిమాల చిత్రీకరణ జరుగుతోన్న తీరు గురించి సినీ పరిశ్రమలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.
పింక్ చిత్రానికి పవన్ ఇంతవరకు రెండో టేక్ తీసుకోలేదట. ఫస్ట్ టేక్‌లో ఏమి చేస్తే అదే ఓకే చేస్తున్నారే తప్ప కనీసం బెటర్మెంట్ కోసం మరో షాట్ తీయడం లేదట. నాలుగు వైపులా కెమెరాలు పెట్టి పవన్ ఏది చేసినా షాట్ ఓకే అనేస్తున్నారట. అలాగే క్రిష్ సినిమా జానపదం అయినా కానీ గ్రీన్ మ్యాట్స్ వేసి ఏదో అలా కానిచ్చేస్తున్నారట కానీ ఇలాంటి సినిమాకి అవసరమైన సెట్ వర్క్ లేదా ప్రొడక్షన్ డిజైన్ కూడా లేదట.