Advertisement

Advertisement


Home > Politics - Gossip

పవన్‌తో సమన్వయం చేసుకుంటేనే పగ్గాలు!

పవన్‌తో సమన్వయం చేసుకుంటేనే పగ్గాలు!

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నది ఎవరు? కన్నా లక్ష్యీనారాయణ స్థానాన్ని భర్తి చేస్తూ.. భారతీయ జనతా పార్టీకి కొత్త జవసత్వాలు ఇవ్వగల భారాన్ని మోయగలిగింది ఎవరు? ఆ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఆశావహుల్లో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి కానీ.. పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం.. కొత్తగా తాము పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీతో సమన్వయం చేసుకుపోయే వారికే పగ్గాలు అప్పగించాలనే ఉద్దేశంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ 2014 ఎన్నికల నాటికి తన పార్టీని మోడీ ఒడిలోనే కూర్చోబెట్టి ఉన్నప్పటికీ.. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు విబేదించారు. అప్పుడు కూడా ఎలాంటి విమర్శలు చేయకుండా.. చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ.. తన రాజకీయపార్టీ జనసేనకు పునాది వేసుకోవడానికి ప్రయత్నించారు. ఎన్ని గిమ్మిక్కులు చేసినా.. తనకు సొంతంగా దక్కగల ఆదరణ ఏడు శాతానికి మించి ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని ఆయనకు అర్థమైంది. ఆ వెంటనే.. భాజపాను కీర్తించే మాటలు వల్లిస్తూ.. నెలల వ్యవధిలోనే తిరిగి వారి చంక ఎక్కారు.

భాజపా పరిస్థితి ఏపీలో మరీ ఘోరం. అంతో ఇంతో పవన్‌కు ఉన్న క్రేజ్ ను వాడుకుని తాము కూడా బలపడాలని వారు చూస్తునారు. అలాంటి నేపథ్యంలో.. పవన్ కల్యాణ్ తో సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపించగల నేతకోసం వారుచూస్తున్నట్లు సమాచారం.

పదవి ఆశిస్తున్న వారిలో ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు, పురందేశ్వరి, సోము వీర్రాజు, మాణిక్యాల రావు, విష్ణువర్దన్ రెడ్డి, మాధవ్ తదితరులు ఉన్నారు. వీరిలో ఎమ్మెల్సీ మాధవ్ కే ఎక్కువ అవకాశమున్నట్టు తెలుస్తోంది.

నిజానికి ఇటీవలే తెలుగుదేశం నుంచి ఫిరాయించి భాజపాలోకి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు కూడా పార్టీ పదవిని ఆశిస్తుండవచ్చు గానీ.. పార్టీనే వారిని ఇంకా పూర్తిగా నమ్మడం లేదనే వాదన కూడా ఉంది. సుజనా చౌదరి తన ప్రయోజనాలకోసం భాజపాలోకి వచ్చిన నేతగానే ప్రజలు అనుకుంటున్నారు. దానికి తగ్గట్లే పార్టీ స్పందన కూడా ఉంది. మొత్తానికి భాజపా కొత్త అధ్యక్షుడు ఎవరనే సంగతిని, పరోక్షంగానైనా పవన్ కల్యాణ్ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది.

మోడీ దోచుకొని తినమని చెప్పాడా నీకు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?