ఆ ఇద్దరితో గేమ్ ఆడిన వంశీ?

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అది అందరికీ తెలిసిందే. కానీ దీని వెనుక ఏం జరిగింది? కథ నచ్చలేదు అన్నది పాయంట్. సరే, మరి ఈ విషయం తెలియడానికి ఇన్నాళ్లు ఎందుకు…

మహేష్ బాబు-వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అది అందరికీ తెలిసిందే. కానీ దీని వెనుక ఏం జరిగింది? కథ నచ్చలేదు అన్నది పాయంట్. సరే, మరి ఈ విషయం తెలియడానికి ఇన్నాళ్లు ఎందుకు పట్టింది? అక్కడే వుంది అసలు విషయం.

ఇటు మహేష్ కు ఇటు దిల్ రాజుకు ఒకరికి తెలియకుండా ఒకరిని మబ్బులో వుంచేయడంతో ఇప్పుడు ఈ సమస్య వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే ఓ గ్యాంగస్టర్ స్టోరీ తయారుచేస్తున్నానని మాత్రం వంశీ పైడిపల్లి చెప్పాడని బోగట్టా.  దీంతో దిల్ రాజు-మహేష్ రిలాక్స్ అయిపోయారు. 

దిల్ రాజు కథ చేయించుకుంటున్నారు, ఆయనకు అన్నీ తెలుసుకదా అని మహేష్ రిలాక్స్ అయ్యారు.

మహేష్ ఎక్కడికి వెళ్లినా వెన్నంటే వుంటున్నారు వంశీ పైడిపల్లి. అందువల్ల వాళ్లు ఇద్దరు కథ ఫైనల్ చేసాక, వినొచ్చులే అనుకున్నారు దిల్ రాజు. 

వన్ వీక్ బ్యాక్ అసలు టైమ్ వచ్చింది. వంశీ పైడిపల్లి టోటల్ నెరేషన్ మహేష్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో ఆయన స్టన్ అయ్యారు. స్క్రిప్ట్ నచ్చలా. వెంటనే దిల్ రాజుకు చెప్పడంతో ఆయనా విన్నారు. ఆయనకూ నచ్చలా? 

కింకర్తవ్యం?

మరో ఆల్టర్ నేటివ్ ఏది వున్నా చేద్దాం అనుకున్నారు. కానీ కనుచూపు మేరలో ఎవ్వరూ కనిపించలేదు. దాంతో ఇక పరుశురామ్ నే ఆప్షన్ అయింది. కానీ ఇక్కడా సమస్య వుంది. పరుశురామ్-మహేష్ అంటే మైత్రీకి మాత్రమే చేయాలి అని ఎక్కడా లేదు. మైత్రీలో పరుశురామ్ ఓ సినిమా చేయాలి. అంతే. 

కానీ పరుశురామ్ ప్రస్తుతం 14రీల్స్ ప్లస్ కు కమిట్ అయి, చైతన్యతో సినిమా ప్రకటించేసారు. అది వెనక్కు జరిపి ఈ సినిమా చేయాలి. దానిపై ఇప్పుడు డిస్కషన్ల స్టార్ట్ అయ్యాయి. రెండు బ్యానర్లను కలపడమా? లేక 14రీల్స్ కు మరో సినిమా హామీ ఇచ్చి  వెనక్కు వుంచడమా? ఏం చేయాలి అన్నది కూడా తేలాల్సి వుంది. లేదా మైత్రీ కి కాకుండా 14రీల్స్ కే సినిమా చేయడమా? ఈ విషయంలో అప్పుడే ఎవరి ప్రయత్నాలు వారు ప్రారంభించేసారు.

ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా వుంది. గతంలో పరుశురామ్ ను మహేష్ దగ్గరకు తీసుకెళ్లి సిట్టింగ్ ఏర్పాటు చేసినపుడు, ప్రాజెక్టులో తను కూడా భాగస్వామిగా వుంటాను అని కొరటాల శివ చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఆయన సంగతి ఏమిటన్నది తేలాలి. 

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు