భీష్మ..రెండో రోజూ కుమ్మేసింది

నైజాంలో తొలిరోజు రెండు కోట్లు వసూలు చేసింది ఓ మీడియం సినిమా అంటే చిన్న విషయం కాదు. అలాంటిది మలి రోజు కూడా పదిలక్షలు తక్కువగా రెండు కోట్లు వసూలు చేసింది అంటే చెప్పుకోవాల్సిందే.…

నైజాంలో తొలిరోజు రెండు కోట్లు వసూలు చేసింది ఓ మీడియం సినిమా అంటే చిన్న విషయం కాదు. అలాంటిది మలి రోజు కూడా పదిలక్షలు తక్కువగా రెండు కోట్లు వసూలు చేసింది అంటే చెప్పుకోవాల్సిందే. అయిదున్నర కోట్ల ఎన్నారె కు తీసుకున్న సినిమా రెండు రోజుల్లో దాదాపు నాలుగు కోట్లు వసూలు చేసింది. మూడో రోజు ఆదివారం. అందువల్ల కోటిన్నర అన్నా వుంటుంది. అంటే మూడు రోజుల్లో ఇచ్చిన అడ్వాన్స్ వచ్చేసింది అంటే డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు హ్యాపీనే కదా.

మిగిలిన ఏరియాలు కూడా అలాగే వుంది పరిస్థితి. రెండు కోట్ల పాతిక లక్షల అడ్వాన్స్ మీద విడుదల చేసిన వైజాగ్ లో రెండో రోజు 58 లక్షలు వచ్చింది. మూడో రోజైన ఆదివారం మరో యాభై లక్షల వస్తే ఇక అక్కడికి 50లక్షలు మాత్రమే రికవరీ కావాల్సి వుంటుంది. మూడు రోజుల్లో దాదాపు మూడు వంతలు అన్ని ఏరియాలు రికవరీ కావడం, నైజాం, ఓవర్ సీస్ ల్లో మూడు రోజులకే దాదాపు సేఫ్ అయిపోవడం అంటే భీష్మ పెద్ద హిట్ కింద లెక్క. 

ఈ మధ్యకాలంలో ఇలా మీడియం సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయినది డైరక్టర్ మారుతి అందించిన ప్రతి రోజూ పండగే సినిమానే. ఇప్పుడు భీష్మ కూడా అదే దారిలో పయనిస్తోంది. 

రెండో రోజు వసూళ్లు ఇలా వున్నాయి.
నైజాం…………..1.90
సీడెడ్…………….0.61
వైజాగ్……………0.58
ఈస్ట్……………..0.26
వెస్ట్…………0.15
కృష్ణ…….0.27
గుంటూరు….0.26
నెల్లూరు…..0.10