మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ

ఓ సినిమా క్యాన్సిల్ కావడం అంటే అదే పెద్ద విషయం కాదు నిజానికి. కానీ మహేష్-వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అన్నది చిన్న కుదుపే. చాలా విషయాలను ఇది ప్రభావితం చేయబోతోంది. గత కొంతకాలంగా …

ఓ సినిమా క్యాన్సిల్ కావడం అంటే అదే పెద్ద విషయం కాదు నిజానికి. కానీ మహేష్-వంశీ పైడిపల్లి సినిమా క్యాన్సిల్ అన్నది చిన్న కుదుపే. చాలా విషయాలను ఇది ప్రభావితం చేయబోతోంది. గత కొంతకాలంగా  మహేష్ ఫ్యామిలీ-వంశీ పైడిపల్లి ఫ్యామిలీ అద్భుతంగా కలిసిపోయారు. పిల్లలతో సహా. అలాంటిది ఇప్పుడు వారి కాంబినేషన్ సినిమా క్యాన్సిల్ అయిపోయింది.  వంశీ ఒక్క సారిగా వేరే హీరోను చూసుకోవాలి. క్లియర్ గా అవకాశం వున్న మహేష్ సినిమాను వంశీ పైడిపల్లి నిలబెట్టుకోలేకపోయారు. సరైన కథ చెప్పి ఒప్పించలేకపోయారు. మరి ఇలాంటి నేఫథ్యంలో మరో హీరోను మాత్రం ఆయన ఎలా ఒప్పించగలగుతారు. 

ఆ విషయం పక్కన పెడితే వంశీ పైడిపల్లితో  సినిమా క్యాన్సిల్ కావడం వల్ల మహేష్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా వున్నారు. పైకి ఏం చెప్పినా, మహేష్ ను చాలా కాలం వెయిట్ చేయించడం, లేట్ గా సినిమా తీయడం వంటివి వంశీ పైడిపల్లి విషయంలో మహేష్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. మహర్షి సినిమా ఫలితం, దాని వ్యవహారాలు, నిజానిజాలు ఎలా వున్నా, మహేష్ ఫ్యాన్స్ మాత్రం వంశీ పైడిపల్లి పట్ల పెద్ద ఆసక్తిగాలేరు. అందుకే ఇప్పుడు ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ కావడం పట్ల వారేమీ అసంతృప్తిగా లేరు. పైగా హ్యాపీ అన్న వార్తలే వినిపిస్తున్నాయి.  వంశీ పైడిపల్లి సినిమా వుందన్న కారణంగా, అది చాలా టైమ్ పడుతుందన్న కారణంగా మరే డైరక్టర్ కూడా మహేష్ ను ఆప్షన్ గాచూడలేదు. దీంతో మహేష్ కు సరైన లైనప్ లేకుడా అయిపోయింది.

డైరక్టర్లు కావాలి

అదే టైమ్ లో ఎన్టీఆర్ ఫుల్ లైనప్ తో వున్నారు. బన్నీ కూడా డిటో. రామ్ ఛరణ్ ప్లాన్లు వేరు. మహేష్ కు మాత్రం డైరక్టర్లు కావాలి. ఇప్పటికే సురేందర్ రెడ్డికి, మరో డైరక్టర్ కు కబుర్లు వెళ్లాయని తెలుస్తోంది. కొరటాల శివ వేరే హీరోలతో రెండు సినిమాలు లాక్ అయి వున్నారు. బోయపాటి సెట్ కారని టాక్. త్రివిక్రమ్ చేస్తారు కానీ, హారిక హాసినిలో అయితేనే చేస్తారు. అది సెట్ కావడం అన్నది మహేష్ మీదే వుంటుంది. రాజమౌళి సినిమా అంటే 2022 నాటి సంగతి. సుకుమార్  ను మహేష్ దూరం చేసుకున్నారు.  టాప్ డైరక్టర్లు అంటే కొరటాల, త్రివిక్రమ్, సుకుమార్, సురేందర్ రెడ్డి ఎవ్వరూ ఇప్పుడు మహేష్ కు అందుబాటులోలేరు. 

పక్క భాష డైరక్టర్లు ప్రశాంత్ నీల్, అట్లీ..లోకేష్ కనగరాజ్ లాంటి వాళ్లు కూడా ఎన్టీఆర్ వైపుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మహేష్ మారాల్సి వుంది. తన బరి నుంచి, గిరి నుంచి బయటకు వచ్చి,  సినిమాలను ప్లాన్ చేసుకోవాల్సి వుంది. మొత్తం మీద వంశీ పైడిపల్లితో బందం ఇచ్చిన పాఠం నుంచి మహేష్ చాలా నేర్చుకోవాల్సి వుంటుందేమో?

అందుకే సిద్ శ్రీరామ్ పాడాడు