ఇండస్ట్రీ లో ‘ఆయన’ డబ్బులు?

టాలీవుడ్ లో రకరకాల జనాలు పెట్టుబడులు పెడుతుంటారు. వడ్డీకి డబ్బులు తిప్పుతుంటారు. మీడియా టైకూన్లు, చానెళ్ల పెద్దల దగ్గర నుంచి రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టడం ఇటీవల పెరిగింది.  లేటెస్ఠ్ గా ఓ స్కామ్…

టాలీవుడ్ లో రకరకాల జనాలు పెట్టుబడులు పెడుతుంటారు. వడ్డీకి డబ్బులు తిప్పుతుంటారు. మీడియా టైకూన్లు, చానెళ్ల పెద్దల దగ్గర నుంచి రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టడం ఇటీవల పెరిగింది.  లేటెస్ఠ్ గా ఓ స్కామ్ అంటూ ఆంధ్రలో సంచలనం సృష్టిస్తున్న ఓ మాజీ మంత్రి డబ్బులు కూడా ఇండస్ట్రీలో తిరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇండస్ట్రీలోకి సర్రున దూసుకువచ్చి, అడ్వాన్స్ లు విత్తనాలుగా జల్లేసిన ఓ సంస్థ కు ఈ మాజీ మంత్రి ఫైనాన్స్ అందచేసినట్లు తెలుస్తోంది. రెండు అక్షరాల పేరున్న ఓ మధ్యవర్తి ఇందుకు అన్ని విధాల సహకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు అక్షరాల పేరున్న మధ్యవర్తి అటు ఆ మాజీ మంత్రికి, ఇటు ఈ నిర్మాణ సంస్థకు బాగా క్లోజ్ అని తెలుస్తోంది.

సుమారు పాతిక కోట్ల వరకు ఆ మాజీ మంత్రి డబ్బులు సదరు నిర్మాణ సంస్థ దగ్గర వున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్కాము అంటూ వార్తలు రావడంతో, ఇవన్నీ తిరిగి తిరిగి తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అన్న ఆందోళన ఆ నిర్మాతల్లో వుందని వినిపిస్తోంది. దీనికి కారణం కొన్ని ఆన్ లైన్ పేమెంట్లు వుండడమే అని కూడా టాక్ వుంది.

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు