Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇండస్ట్రీ లో 'ఆయన' డబ్బులు?

ఇండస్ట్రీ లో 'ఆయన' డబ్బులు?

టాలీవుడ్ లో రకరకాల జనాలు పెట్టుబడులు పెడుతుంటారు. వడ్డీకి డబ్బులు తిప్పుతుంటారు. మీడియా టైకూన్లు, చానెళ్ల పెద్దల దగ్గర నుంచి రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టడం ఇటీవల పెరిగింది.  లేటెస్ఠ్ గా ఓ స్కామ్ అంటూ ఆంధ్రలో సంచలనం సృష్టిస్తున్న ఓ మాజీ మంత్రి డబ్బులు కూడా ఇండస్ట్రీలో తిరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇండస్ట్రీలోకి సర్రున దూసుకువచ్చి, అడ్వాన్స్ లు విత్తనాలుగా జల్లేసిన ఓ సంస్థ కు ఈ మాజీ మంత్రి ఫైనాన్స్ అందచేసినట్లు తెలుస్తోంది. రెండు అక్షరాల పేరున్న ఓ మధ్యవర్తి ఇందుకు అన్ని విధాల సహకరించినట్లు తెలుస్తోంది. ఈ రెండు అక్షరాల పేరున్న మధ్యవర్తి అటు ఆ మాజీ మంత్రికి, ఇటు ఈ నిర్మాణ సంస్థకు బాగా క్లోజ్ అని తెలుస్తోంది.

సుమారు పాతిక కోట్ల వరకు ఆ మాజీ మంత్రి డబ్బులు సదరు నిర్మాణ సంస్థ దగ్గర వున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు స్కాము అంటూ వార్తలు రావడంతో, ఇవన్నీ తిరిగి తిరిగి తమకు ఎక్కడ చుట్టుకుంటాయో అన్న ఆందోళన ఆ నిర్మాతల్లో వుందని వినిపిస్తోంది. దీనికి కారణం కొన్ని ఆన్ లైన్ పేమెంట్లు వుండడమే అని కూడా టాక్ వుంది.

అంతా మోడీ చెప్తేనే చేసాను.. నా తప్పు లేదు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?