ఈసారైనా దిల్ రాజు లాభాలు కళ్ల చూస్తారా?

నిర్మాత, పంపిణీదారు అయిన దిల్ రాజుకు చిరకాలంగా లక్ కలిసి రావడంలేదు. గత ఏడాది అంతా నిర్మాతగా సక్సెస్ లు కొడితే, డిస్ట్రిబ్యూటర్ గా నష్టాలు చవిచూసారు. ఈ ఏడాది అటు డిస్ట్రిబ్యూటర్ గా,…

నిర్మాత, పంపిణీదారు అయిన దిల్ రాజుకు చిరకాలంగా లక్ కలిసి రావడంలేదు. గత ఏడాది అంతా నిర్మాతగా సక్సెస్ లు కొడితే, డిస్ట్రిబ్యూటర్ గా నష్టాలు చవిచూసారు. ఈ ఏడాది అటు డిస్ట్రిబ్యూటర్ గా, ఇటు నిర్మాతగా కూడా ఇప్పటి దాకా నష్టాలే చూసారు. దాంతో ఇక సినిమాలు కొనడం ఆపేసారు. 

అజ్ఞాతవాసి అడ్జస్ట్ మెంట్ లతో శైలజారెడ్డి అల్లుడు తీసుకున్నారు. అది బొటాబొటీగా గట్టెక్కారు. మిగిలిన పంపిణీ సినిమాలు అన్నీ నష్టాలే ఇచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా అరవింత సమేత వీర రాఘవను ఆయనే నైజాంలో పంపిణీ చేస్తున్నారు. జీఎస్టీ ఇతరత్రా అన్నీకలిపి 18 కోట్ల మేరకు కట్టి సినిమా తీసుకున్నారు. తొలిరోజు అయిదున్నర కోట్ల వరకు రికవరీ వచ్చింది. మరో పదమూడు కోట్లు రావాలి.

అరవిందకు మంచి టాక్ వచ్చింది. అన్ని వైపుల నుంచి పాజిటివ్ ట్రెండ్ నే వుంది. పైగా సెలవుల సీజన్ ఇది. అందువల్ల మరో పదమూడు కోట్లు రావడం పెద్దగా కష్టం కాదన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. కచ్చితంగా నైజాంలో 20 కోట్ల షేర్ దాటుతుందని ఫ్యాన్స్ వర్గాలు అంటున్నాయి.

అదే జరిగితే దిల్ రాజు లాభాలు కళ్ల చూస్తారు. నైజాంలో కూడా టికెట్ రేట్లు కొద్దిగా అంటే దగ్గర దగ్గర 20 రూపాయల మేర పెంచారు. అందువల్ల ఫస్ట్ వీకెండ్ నాలుగు రోజులు కలిపి మంచి ఫిగర్ నే వస్తుందని అంచనా వేస్తున్నారు. పది నుంచి పన్నెండు కోట్ల మధ్యలో ఫస్ట్ వీకెండ్ ఫిగర్ వుంటుందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దిల్ రాజు హ్యాపీ అయిపోవచ్చు.

ఆయన స్వంత సినిమా హలోగురూ ప్రేమకోసమే సినిమా ఈనెల 18న విడుదల వుంది. ఆలోగా అరవింద సమేత డబ్బులు వసూలు చేసేసుకోవాలి. మరి ఏమవుతుందో, మార్కెట్ ఎలా వుంటుందో చూడాలి.