Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

లక్ష్మీస్ ఎన్టీఆర్.. మళ్లీ బయటకు

లక్ష్మీస్ ఎన్టీఆర్.. మళ్లీ బయటకు

ఆగిపోయిందనుకున్నారా? రాలేదనుకున్నారా? అన్న సినిమా డైలాగు చెప్పినట్లు వుంది వ్యవహారం. ఎన్టీఆర్ బయోపిక్ టైమ్ లోనే ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రకటన వచ్చింది. ఓ లుక్ లాంటి స్టిల్ వచ్చింది. దాని మీద అప్పట్లో చాలా వార్తలే వచ్చాయి. కానీ తరువాత డైరక్టర్ ఆర్జీవీ ఆఫీసర్ సినిమాలో బిజీ అయిపోయారు. దాంతో ఈ సినిమా మరుగునపడిపోయింది.

కానీ ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చింది. ఆర్జీవీ ట్విట్టర్ లో ఈ రోజు ఈ సినిమాను బయటకు తీసారు. విజయదశమికి స్టార్ట్ చేస్తున్నామని, 19న వివరాలు ప్రకటిస్తా అని వెల్లడించారు. ఆర్జీవీ అనుకుంటే మహా మొండి. నెల రోజుల్లో ఏదో ఒకటి తీసి అవతల పెడతాడు. అది బాగుంటుందా? బాగుండదా? అన్నది వేరే సంగతి. సినిమా అయితే మెషిన్ లో కాగితం పెట్టి, జిరాక్స్ తీసినంత ఈజీగా తీసి విడుదల చేసేస్తాడు.

మరి ఎన్టీఆర్ జీవితం లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన తరువాత ఎలా వుంటుందో? ఎలా మారిందో? ఎలా ముగిసిందో ఆర్జీవీ ఏం చెప్పబోతున్నాడో? ఆ మధ్య వీరగంధం వివరాలతో కూడా మరో లక్ష్మీ పార్వతి కథ సినిమాగా తీస్తామని కొందరు హల్ చల్ చేసారు. అదీ మరుగున పడింది. ఇప్పుడు అదీ బయటకు లేస్తుందేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?