ఎక్స్ క్లూజివ్ – కొత్త హీరోతోనే శేఖర్ కమ్ముల

ఫిదా తరువాత శేఖర్ కమ్ముల ఎవరితో, ఏ బ్యానర్ లో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గా వుంటూ వస్తోంది. అయితే ఇటీవలే బ్యానర్ క్లారిఫికేషన్ వచ్చింది. నైజాం టాప్ ఎగ్జిబిటర్ కమ్ టాప్ డిస్ట్రిబ్యూటర్…

ఫిదా తరువాత శేఖర్ కమ్ముల ఎవరితో, ఏ బ్యానర్ లో సినిమా చేస్తాడన్నది సస్పెన్స్ గా వుంటూ వస్తోంది. అయితే ఇటీవలే బ్యానర్ క్లారిఫికేషన్ వచ్చింది. నైజాం టాప్ ఎగ్జిబిటర్ కమ్ టాప్ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ నిర్మాతగా మారుతున్నారు. ఆయన తన బ్యానర్ పై నిర్మించే తొలి సినిమాకు శేఖర్ కమ్ములనే డైరక్టర్ గా ఫిక్స్ అయ్యారు. ఈ సినిమా ప్రకటన అయితే బయటకు వచ్చింది కానీ, హీరో ఎవరు అన్నది పక్కా కాలేదు.

అయితే లేటెస్ట్ ఇన్ ఫర్మేషన్ ఏమిటంటే, శేఖర్ కమ్ముల మరోసారి కొత్త హీరోతోనే సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. గతంలో శేఖర్ కమ్ముల చాలా సినిమాలు కొత్త హీరోలతోనే చేసారు. ఆయన స్కూలు నుంచి చాలామంది కొత్త హీరోలు వచ్చారు. నిఖిల్, విజయ్ దేవరకొండ ఇలా చాలామంది శేఖర్ కమ్ముల సినిమాలతో ఇండస్ట్రీలోకి వచ్చిన వారే. 

ఇప్పుడు అదే విధంగా ఓ కొత్త హీరోను ఇంట్రడ్యూస్ చేసే పనిలో శేఖర్ కమ్ముల వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఇద్దరిని సెమీ ఫైనల్ లిస్ట్ లోకీ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరు ఫైనల్ అవుతారా అన్నది మరో ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోతుంది. ఈ ఇద్దరిలో ఒకరు ఇండస్ట్రీకి పరిచయం వున్న ఫ్యామిలీకి చెందిన కుర్రాడే. చూడాలి మరి ఎవరికి శేఖర్ కమ్ముల ఫైనల్ చేస్తారో?