బాలయ్య.. బెల్ బాటమ్ ఫ్యాంటూ

సీనియర్ ఎన్టీఆర్ జనరేషన్ లో ఆయన చేత విజయవాడ యాక్స్ టైలర్ వాలేశ్వరరావు వేయించిన డ్రెస్ లు ఇలాంటివి అలాంటివి కాదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ అభిమానులు తు.చ తప్పకుండా ఫాలో అయిపోయేవారు. ఎలిఫెంట్…

సీనియర్ ఎన్టీఆర్ జనరేషన్ లో ఆయన చేత విజయవాడ యాక్స్ టైలర్ వాలేశ్వరరావు వేయించిన డ్రెస్ లు ఇలాంటివి అలాంటివి కాదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ అభిమానులు తు.చ తప్పకుండా ఫాలో అయిపోయేవారు. ఎలిఫెంట్ కాలర్, బెల్ బాటమ్ ఫ్యాంట్, పువ్వుల చొక్కాలు.. అబ్బో.. ఆ లుక్కులే వేరు. ఇప్పుడు వేస్తే, జనం ఎగాదిగా చూస్తారు అనుకోండి. అది వేరే సంగతి. మరి అలాంటి డ్రెస్ లో బాలయ్య కనిపిస్తే..

వస్తోంది.. ఆ టైమూ వస్తోంది. వేటగాడు సినిమాలో ఆకుచాటు పిందె తడిసే పాటను ఎన్టీఆర్ బయోపిక్ లో చూపిస్తున్నారు మరోసారి. ఇందుకోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకువచ్చారు. బాలయ్య ఎన్టీఆర్ గా, రకుల్ శ్రీదేవి మాదిరిగా అన్నమాట. ఈ స్టిల్ ఇప్పుడు బయటకు వదిలారు.

అచ్చంగా వేటగాడులో ఎన్టీఆర్ మాదిరిగా టోపీతో బాలయ్య భలేగా వున్నారు. బెల్లబాటమ్ ఫ్యాంటూ, చొక్కా, కోటూతో కనిపిస్తున్నారు. రుకుల్ తెల్లచీరతో శ్రీదేవి పేటెంటెడ్ భంగిమతో కనిపిస్తోంది. మొత్తంమీద భలేగా వుంది స్టిల్.