cloudfront

Advertisement


Home > Movies - Movie Gossip

పాపం రకుల్.. మళ్లీ దొరికిపోయింది

పాపం రకుల్.. మళ్లీ దొరికిపోయింది

గతంలో ఓసారి చెత్త డ్రెస్సింగ్ కారణంగా నెటిజన్లకు బుక్కయిపోయింది. మొన్నటికిమొన్న మంచులక్ష్మితో దిగిన ఓ ఫొటో కారణంగా ట్రోలింగ్ కు గురైంది. ఆ ఫొటో ఇంకా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, ఇప్పుడు మరోసారి బుక్కయిపోయింది రకుల్ ప్రీత్ సింగ్.

ఎన్టీఆర్ బయోపిక్ లో రకుల్ ప్రీత్ నటిస్తోంది. సినిమాలో ఆమె శ్రీదేవి పాత్ర పోషిస్తోంది. ఆకుచాటు పిందె తడిసె అనే పాట కోసం ఆమెను తీసుకున్నారు. అంతకుమించి బయోపిక్ లో రకుల్ కు సీన్ లేదు. శ్రీదేవి గెటప్ లో రకుల్ ఉన్న స్టిల్ ను ఈరోజు రిలీజ్ చేశారు. స్టిల్ ఇలా వచ్చిందో లేదో అలా ట్రోలింగ్ అయింది. 

శ్రీదేవి వేషంలో ఉన్న శ్రీరెడ్డిలా ఉందని కొందరు విమర్శిస్తే, శ్రీదేవికి సంబంధించి ఒక్క పోలికైనా చూపించంటూ మరికొందరు ఫన్నీగా సవాల్ చేశారు. ఇంకొందరు రాంగ్ సెలక్షన్ అంటూ పోస్టులు పెట్టారు. మరికొందరు శ్రీదేవి పరువు తీశారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో చాలమందికి రకుల్ ఎంపిక నచ్చలేదు. 

బయోపిక్ కు సంబంధించి ఈ ఒక్క విషయంలో మాత్రం క్రిష్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. చంద్రబాబు గెటప్ లో రానాను, ఏఎన్నార్ గా సుమంత్ ను అద్భుతంగా చూపించిన క్రిష్.. రకుల్ విషయానికొచ్చే సరికి మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. మేకప్, డ్రెస్సింగ్ మినహా లుక్స్ పరంగా శ్రీదేవి ఛాయలు అస్సలు కనిపించలేదు రకుల్ ప్రీత్ లో.