కొరటాల శివ చాలా సైలంట్ గా వున్నారు చిరకాలంగా. భరత్ అనే నేను తరువాత ఆయన అనుకోకుండా చిరంజీవితో సినిమా కమిట్ అయ్యారు. అది చూస్తే 2018లో ప్రారంభమై, 2019లో విడుదలయ్యేలా వుంది. దాంతో ఆయన దాదాపు పూర్తిగా సైలెంట్ మోడ్ లో వుండిపోయారు.
ఇలాంటి టైమ్ లో ఒక్కసారికి మళ్లీ వార్తల్లోకి వచ్చారు కొరటాల. దీనికి కారణం ఆయన చేసిన ఓ ట్వీట్ నే. తన మిత్రుడు సుధాకర్ బర్త్ డే సందర్భంగా ట్వీట్ చేస్తూ, తన ఫ్యూచర్ ప్రాజెక్టులు అన్నీ ఇక సుధాకర్ తోనే వుంటాయని పేర్కొన్నారు. నిజానికి అది కొంత వరకు వాస్తవం కూడా. ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్ కు నిర్మాత సుధాకర్ నే. ఈ విషయం ఎన్టీఆర్ కూడా కన్ ఫర్మ్ చేసాడు.
ఇదిలా వుంటే మెగాస్టార్-కొరటాల శివ సినిమాకు నిర్మాతలుగా కొణిదెల ప్రొడక్షన్స్, మాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ (నిరంజన్ రెడ్డి) మాత్రమే వుంటారని, వేరే భాగస్వాములు ఎవ్వరూ వుండరనే అనాధరైజ్డ్ ప్రకటన ఒకటి వచ్చింది.
అసలు కొరటాల శివ కేవలం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పి ఊరుకోకుండా ఇకపై తన సినిమాలు అన్నీ తన మిత్రుడి బ్యానర్ లోనే వుంటాయని చెప్పడం ఏమిటో? అది పట్టుకుని, మెగాస్టార్ సినిమా యూనిట్, వేరే ఫీలర్ వదలడం ఏమిటో?
అంతా చూస్తుంటే తెరవెనుక ఏదో జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. అనుకోకుండా చిరంజీవి సినిమాకు ఇరుక్కుపోయిన కొరటాల శివ, ఇప్పుడు ఏదో విధంగా బయటకు రావాలనుకుంటున్నారా? అందుకోసం ఈ మార్గం ఎంచుకున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.