తొలి అనుభవం ప్రత్యేకం అంటున్న హీరోయిన్

రాజా-రాణి.. ఈ సినిమాకు టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా ఇందులో నటించిన నజ్రియా నజీమ్ ను చూసి అప్పట్లో చాలామంది మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు…

రాజా-రాణి.. ఈ సినిమాకు టాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మరీ ముఖ్యంగా ఇందులో నటించిన నజ్రియా నజీమ్ ను చూసి అప్పట్లో చాలామంది మనసు పారేసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు ఈ బ్యూటీ. ఇన్నాళ్లకు నాని సినిమాతో తెలుగుతెరకు పరిచయమౌతోంది.

నాని నటిస్తున్న ''అంటే సుందరానికి' సినిమాలో నజ్రియాను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. నజ్రియా సెట్స్ పైకి వచ్చింది. తన ఆనందాన్ని ఇనస్టాగ్రామ్ లో పంచుకున్న ఈ బ్యూటిఫుల్ హీరోయిన్.. “ఈరోజు నా ఫస్ట్ తెలుగు మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాను. ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ ఎప్పుడూ ప్రత్యేకమే” అంటూ పోస్ట్ పెట్టింది.

ఈ సినిమా షూటింగ్ కోసం భర్త ఫహాద్ ఫాజిల్ తో కలిసి హైదరాబాద్ వచ్చింది నజ్రియా. ఓవైపు కరోనా భయపెడుతున్నప్పటికీ.. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడం విశేషం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోంది ఈ మూవీ.

ఇటు నజ్రియా, అటు ఆమె భర్త ఫహాద్ ఒకేసారి తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు. బన్నీ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో విలన్ గా ఫహాద్ ఫాజిల్ ను తీసుకున్నారు.