విశాఖ స్టీల్ ప్లాంట్ మీద జగన్ ఉక్కు సంకల్పం…?

విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీకి తలమానికం. నవరత్నాల్లో ఒకటిగా ఉంది. ఇక విశాఖ ఇంతలా అభివృద్ధి చెందడానికి విశాఖ ఉక్కు కర్మాగారం ఉండడమే ప్రధాన కారణం.  Advertisement అటువంటి ఉక్కు కర్మాగారాన్ని ఏమీ కాకుండా…

విశాఖ స్టీల్ ప్లాంట్ ఏపీకి తలమానికం. నవరత్నాల్లో ఒకటిగా ఉంది. ఇక విశాఖ ఇంతలా అభివృద్ధి చెందడానికి విశాఖ ఉక్కు కర్మాగారం ఉండడమే ప్రధాన కారణం. 

అటువంటి ఉక్కు కర్మాగారాన్ని ఏమీ కాకుండా బీజేపీ ప్రైవేట్ పరం చేస్తామని అంటోంది. ఈ విషయంలో ఎవరు చెప్పినా వినమని కూడా చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి అంతా మా ఇష్టం అంటోంది.

దీని మీద పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. విశాఖ పాలనా రాజధానిగా ప్రకటించిన వైసీపీకి కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఒక పెను సవాల్ గా మారుతోంది. 

అయితే ఈ విషయంలో జగన్ పక్కా క్లారిటీగా ఉన్నారు అంటున్నారు. పైగా విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం కానీయరాదు అన్న ఉక్కు సంకల్పంతో కూడా ఆయన ఉన్నారని అంటున్నారు.

కేంద్రం మాట ఎవరి మాటా కూడా వినకుండా ప్రైవేట్ పరం చేయాలని గట్టిగా ముందుకు వెళ్తే అడ్డుకోవడానికి ఏం చేస్తారో అన్నీ చేస్తారు అన్నది ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న మాట. ఇక విశాఖ ఉక్కుని అమ్మడానికే కేంద్రం నిర్ణయించుకుంటే దాన్ని కొనడానికి ఏపీ సర్కారే ముందుకు వస్తుంది అని కూడా అంటున్నారు. 

మొత్తానికి తన చేతుల నుంచి విశాఖ ఉక్కుని ప్రైవేట్ వ్యక్తులకు పోనీయరాదు అన్నదే జగన్ గట్టి పట్టుదల అంటున్నారు. మొత్తానికి జగన్ పట్టుదల ఇదే  అయితే మాత్రం విశాఖ ఉక్కు కార్మికులు ఇక బేఫికర్ గా ఉండొచ్చు.