షోలు, టికెట్ రేట్లు పెంపు

పెద్ద సినిమాలు విడుదలయితే స్పెషల్ షోలు అన్నవి కామన్. అయితే అవన్నీ అనాధరైజ్డ్. ఆంధ్రలో అధికారులకు అక్కడక్కడ మామూళ్లు ఇచ్చి ఉదయం ఎగస్ట్రా షోలు వేసుకోవడం అన్నది మామూలే. అయితే దాదాపు గత రెండేళ్లుగా…

పెద్ద సినిమాలు విడుదలయితే స్పెషల్ షోలు అన్నవి కామన్. అయితే అవన్నీ అనాధరైజ్డ్. ఆంధ్రలో అధికారులకు అక్కడక్కడ మామూళ్లు ఇచ్చి ఉదయం ఎగస్ట్రా షోలు వేసుకోవడం అన్నది మామూలే. అయితే దాదాపు గత రెండేళ్లుగా అధికారికంగానే అదనపు షోలకు అనుమతి ఇస్తోంది ప్రభుత్వం. అలాగే రేట్లు పెంచుకోవడానికి కూడా. గతంలో ఇలా చాలా సినిమాలకు ఇచ్చారు.

ఇప్పుడు ఈవారం విడుదలవుతున్న అరవింద సమేత వీరరాఘవకు కూడా అదనపు ఆటలకు, అలాగే టికెట్ రేట్ల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆదేశాలు సంతకాలు అయిపోయాయని, సోమవారం బయటకు వస్తాయని వినికిడి.

11 నుంచి 19 వరకు టికెట్ రేట్లను పెంచుకోవచ్చు. కొన్ని జిల్లాకేంద్రాల్లో 200, దిగువన 150 టికెట్ రేట్లు వుంటాయని తెలుస్తోంది. అలాగే ఉదయం ఎర్లీ షోలు కూడా డిమాండ్ ను బట్టి వుంటాయని తెలుస్తోంది.

అరవింద సమేత వీరరాఘవ సినిమా ఆంధ్రలో 35కోట్ల మేరకు బిజినెస్ చేసింది. ఫస్ట్ వీక్ లోనే రికవరీ కావాలంటే ఈ మాత్రం ఏర్పాట్లు తప్పదు.