చరణ్ కోసం తెరపైకి మరో 2 టైటిల్స్

మొన్నటివరకు స్టేట్ రౌడీ అనే పేరు చక్కర్లుకొట్టింది. మెగా కాంపౌండ్ కావాలనే ఈ టైటిల్ ను లీక్ చేసింది. దీనిపై ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు చరణ్-బోయపాటి సినిమా కోసం…

మొన్నటివరకు స్టేట్ రౌడీ అనే పేరు చక్కర్లుకొట్టింది. మెగా కాంపౌండ్ కావాలనే ఈ టైటిల్ ను లీక్ చేసింది. దీనిపై ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు చరణ్-బోయపాటి సినిమా కోసం మరో 2 టైటిల్స్ తెరపైకి వచ్చాయి. 

ఈసారి ఓ మాస్ టైటిల్, మరో క్లాస్ టైటిల్ బయటకొచ్చాయి. ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి. రెండూ భలే వెరైటీగా ఉన్నాయి. ముందుగా మాస్ టైటిల్ విషయానికొస్తే 'రౌడీ తమ్ముడు' అనే పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. స్టేట్ రౌడీ అనే టైటిల్ లో రౌడీకి, పవన్ కల్యాణ్ నటించిన తమ్ముడు టైటిల్ లింక్ చేసి పెట్టారన్నమాట. సినిమాలో చరణ్ ది ఇద్దరు అన్నలకు తమ్ముడి పాత్ర. అందుకే ఇలా పెట్టారేమో.

ఇక క్లాస్ టైటిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ టైటిల్ పేరు 'వినయ విధేయ రామ'. ఇదేం టైటిల్ అని ఆశ్చర్యపోవద్దు. బెల్లంకొండ సినిమాకు జయజానకి నాయక అనే పేరుపెట్టినట్టు, చరణ్ సినిమాకు ఇలా క్లాసీగా వినయ విధేయ రామ అనే పేరు ఫిక్స్ చేశాడట బోయపాటి. 

రౌడీ తమ్ముడు అనేది మెగా కాంపౌండ్ టైటిల్, వినయ విధేయ రామ అనేది బోయపాటి ఫిక్స్ చేసిన టైటిల్. ప్రస్తుతానికి ఈ రెండు టైటిల్స్ ను బయటకు వదిలారు. రెస్పాన్స్ చూసి ఒకటి ఫిక్స్ చేస్తారన్నమాట. ఎక్కువమంది మాత్రం వినయ విధేయ రామ అనే టైటిల్ నే ఫిక్స్ చేయొచ్చంటున్నారు. ఏ విషయం దసరాకు తేలిపోతుంది.