అరవిందపై కుట్ర జరిగిందా?

అరవింద సమేత వీరరాఘవ. ఈనెల 11న విడుదల. అయితే ఈ సినిమాను ఇరుకున పెట్టాలనే కుట్ర జరిగిందని తెలుస్తోంది. నోటా సినిమాను 5న విడుదల చేసారు. కానీ వాస్తవానికి ఆ సినిమా 18న విడుదల…

అరవింద సమేత వీరరాఘవ. ఈనెల 11న విడుదల. అయితే ఈ సినిమాను ఇరుకున పెట్టాలనే కుట్ర జరిగిందని తెలుస్తోంది. నోటా సినిమాను 5న విడుదల చేసారు. కానీ వాస్తవానికి ఆ సినిమా 18న విడుదల కావాల్సింది. 18న వద్దు అని కొందరు అడ్డంపడిన సంగతి తెలిసిందే. 18న హలోగురూ ప్రేమకోసమే సినిమా విడుదల వుంది. అందుకే దిల్ రాజు నోటా డేట్ మార్చుకోమని వత్తిడి తెచ్చారు.

అంతవరకు వార్తలు వచ్చాయి. అందరికీ తెలిసింది. కానీ నోటా వెనక్కు వెళ్లకుండా, ముందుకు వచ్చి, అక్టోబర్ 5న విడుదల కావడం వెనుక ఇండస్ట్రీలో కొందరు కావాలని ప్లాన్ చేసారని అరవింద యూనిట్ జనాలు ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. అలాచేయడం ద్వారా అరవిందకు థియేటర్లు దొరక్కుండా చేసే ప్లాన్ వుందని తెలుస్తోంది.

అదెలా వుంటే నోటా కనుక హిట్ అయితే రెండోవారం థియేటర్రలోంచి లేవదు. అప్పుడు అరవిందకు సమస్య వస్తుంది. గతంలో మాదిరిగా ఆదికి ముందే థియేటర్లు అగ్రిమెంట్లు చేసుకోవడంలేదు ఇప్పుడు. నోటా కనుక హిట్ అయితే మలివారం థియేటర్లు అరవిందకు దొరకవు.

అదే స్ట్రాటజీతో కావాలని నోటాను ముందుకు వచ్చేలా తెరవెనుక కొందరు పావులు కదిపారని తెలుస్తోంది. అయితే ఇప్పుడు నోటాకు సరైన టాక్ రావడపోవడం వల్ల ఇక థియేటర్ల సమస్యరాదు.