బెడ్‌పై నుంచే జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాను ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మాత్రం విమ‌ర్శ‌లు మాన‌లేదు. ఒక‌వైపు క‌రోనాతో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ, విశ్రాంతిలో ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌ట్ట‌కుండా ఉండ‌లేక పోతున్నారు.…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాను ఎలాంటి ప‌రిస్థితుల్లో ఉన్నా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై మాత్రం విమ‌ర్శ‌లు మాన‌లేదు. ఒక‌వైపు క‌రోనాతో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ, విశ్రాంతిలో ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌ట్ట‌కుండా ఉండ‌లేక పోతున్నారు. క‌రోనాబారిన ప‌డ్డ ప‌వ‌న్ తొలిసారిగా స్పందించారు. క‌రోనా నుంచి కోలుకుని త్వ‌ర‌గా ప్ర‌జ‌ల ముందుకు వ‌స్తాన‌ని చెప్పుకొచ్చారు.

వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ కోలుకుంటున్నాన‌ని తెలిపారు. తాను సంపూర్ణ ఆరోగ్యవంతుడిని కావాలని అందరూ ఆశించారు, వారందరికీ త‌న హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మీ ముందకు వచ్చి ప్రజల కోసం నిలబడతానని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా పరిస్థితిపై జ‌గ‌న్ ప్రభుత్వ తీరును ప‌వ‌న్‌క‌ల్యాణ్ తప్పు పట్టారు. ఏపీలో కరోనా రోగుల‌కు ఆసుపత్రుల్లో పడకలు, ఔషధాలు, ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోవడం దురదృష్టకమని ఆయ‌న పేర్కొన్నారు. 

క‌రోనా సెకెండ్ వేవ్‌ను అంచనా వేయకపోవటం వల్లే ప్ర‌స్తుతం ఆందోళ‌న‌క‌ర‌ పరిస్ధితికి దారి తీసింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికైనా జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.