ఔను, చంద్రబాబు మారరుగాక మారరు.!

కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం కూడా ఇవ్వకుండానే నానా యాగీ చేసేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. నిజానికి, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే…

కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం కూడా ఇవ్వకుండానే నానా యాగీ చేసేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. నిజానికి, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే విమర్శలు షురూ అయ్యాయి టీడీపీ నుంచి. తొలుత ఆరు నెలల సమయం ఇస్తామని ప్రకటించి, నెల రోజులు కూడా గడవకుండానే మాట తప్పిన చంద్రబాబు, ఏడాది సమయం వేచి చూస్తారా.? ఛాన్సే లేదు.

అప్పుడే టీడీపీ అధినేత నుంచి యాత్రలు మొదలైపోయాయి. బస్సు యాత్రలు షురూ చేసిన చంద్రబాబు, తనను ఓడించిన ఓటర్ల మీద సెటైర్లు వేసేస్తున్నారు. ఇదేం పైశాచిక ఆనందం.? అనడక్కూడదంతే. ఆయన చంద్రబాబు.. ఆయన తీరే అంత. ఓటర్లపై ఇంత వెకిలిగా వ్యాఖ్యానించడం చంద్రబాబుకి అలవాటే. ‘నేను వేసిన రోడ్ల మీద నడవొద్దు..’ అని గతంలో చంద్రబాబు ఓటర్లను ఉద్దేశించి హుకూం జారీ చేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.?

ఈసారి చంద్రబాబు వాగ్ధాటికి టీడీపీ కార్యకర్తలే షాకయ్యారు. ‘మీలో చాలామంది వైసీపీకి ఓటేశారు కదా.?’ అంటూ చంద్రబాబు ప్రశ్నించేసరికి అవాక్కయిన టీడీపీ కార్యకర్తలు, కాస్సేపటికిగానీ తేరుకోలేకపోయారు. ‘లేదు’ అని సమాధానం ఇచ్చినా చంద్రబాబు నమ్మలేదాయె. ‘ఓట్లేశారు కదా, అనుభవించాల్సిందే..’ అంటూ చంద్రబాబు తనదైన స్టయిల్లో ప్రసంగం కొనసాగించుకుంటూ పోయారు.

చంద్రబాబు నోట షరామామూలుగానే వచ్చే ‘ఆణిముత్యాలు’ చాలానే వచ్చేశాయి ఈ వెరైటీ యాత్రలో. ‘నాకు సెక్యూరిటీ తగ్గించారు.. నాకేం భయం లేదు. ప్రజలే నన్ను కాపాడుకుంటారు..’ అన్నది ఓ ఆణి ముత్యం. ఇంకోటేమో, ‘వైసీపీ తోక కత్తిరించే రోజొస్తుంది.. స్థానిక ఎన్నికల్లోనే అది జరుగుతుంది’ అని చంద్రబాబు సెలవిచ్చారు. మర్చిపోయారేమో.. టీడీపీ తోకని ఓటర్లు కత్తిరించి ఏడాది కూడా పూర్తికాలేదింకా.!

సుదర్ఘీ రాజకీయ అనుభవం చంద్రబాబు సొంతం. ఆ రాజకీయ అనుభవం ఆయనకు పాఠాలు నేర్పి వుండాలి. కానీ, ఆ అనుభవం తాలూకు ఛాయలు ఏమాత్రం చంద్రబాబులో కన్పించవు. ప్రతిసారీ ‘నేను మారిపోయాను’ అని చంద్రబాబు చెబుతుంటారుగానీ.. ఆయన మారరుగాక మారరంతే.!

నితిన్ తో 'ఖుషీ' గా ఉంది