వేసవిలో చెమట తగ్గించుకోవడం ఎలా?

చెమట పట్టడం మంచిదే. శరీర ఉష్ణోగ్రతను స్వేదగ్రంధులు నియంత్రిస్తాయి. అయితే కొందరికి అదే పనిగా చెమట పడుతుంది. పొద్దున్న లేచిన నుంచి రాత్రి నిద్రపోయేవరకు వేసవిలో వీళ్లు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఇలా అధిక…

చెమట పట్టడం మంచిదే. శరీర ఉష్ణోగ్రతను స్వేదగ్రంధులు నియంత్రిస్తాయి. అయితే కొందరికి అదే పనిగా చెమట పడుతుంది. పొద్దున్న లేచిన నుంచి రాత్రి నిద్రపోయేవరకు వేసవిలో వీళ్లు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఇలా అధిక చెమటతో బాధపడేవాళ్లు ఏం చేయాలి?

చెమట తగ్గడం కోసం చాలామంది మార్కెట్లో దొరికే పౌడర్లు, డియోడరెంట్లు వాడుతుంటారు. అయితే ఇవన్నీ తాత్కాలికంగా పనికొస్తాయి. ఇంకా చెప్పాలంటే పూసుకున్న 2 గంటల తర్వాత వీటి ప్రభావం శూన్యం. దీని బదులు లైఫ్ స్టయిల్ చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల అధిక చెమట నుంచి ఈజీగా బయటపడొచ్చు.

ఎండాకాలంలో వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. ఎక్కువగా ఒత్తిడికి గురికాకూడదు. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు గొడుగు తప్పనిసరిగా వాడాలి. అతిగా కూల్ డ్రింక్స్ తాగకూడదు. వీటితో పాటు ఎండాకాలం కాఫీ, టీలు కాస్త తగ్గించాలి. కెఫిన్ వల్ల చెమట ఎక్కువగా పడుతుంది.

ఇక తీసుకునే ఆహారం విషయానికొస్తే, వేసవి కాలం ప్రాసెస్ చేసిన వంటకాల జోలికి వెళ్లకూడదు. వీటితో పాటు అధిక కొవ్వు కలిగిఉన్న పదార్థాలు తగ్గించాలి. ఆల్కహాల్, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కారంగా ఉండే వంటకాలు తినడం వల్ల చెమట ఎక్కువగా పడుతుంది.

ఇక ఇంటి చిట్కాల విషయానికొస్తే.. ఇంట్లో తయారుచేసుకున్న టమాట జ్యూస్ ను రోజూ ఒక గ్లాస్ తాగడం వల్ల చెమటను తగ్గించుకోవచ్చు. దీని స్థానంలో వీట్ గ్రాస్ జ్యూస్ కూడా తాగొచ్చు. 

రెగ్యులర్ గా ఇది తాగడం వల్ల అధిక చెమట నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక చెమటతో బాధపడేవారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే వేళల్లో బయటకు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి.