బోయపాటి అరగంట.. త్రివిక్రమ్ రెండు గంటలట

అరవింద సమేత వీరరాఘవ ట్రయిలర్ బయటకు వచ్చింది. ఫ్యాన్స్ కావచ్చు, యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, త్రివిక్రమ్ ఏంటీ? ఈ ఫైట్లు, ఈ హింస, ఈ మాస్ మసాలా ఏంటీ అంటూ డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి.…

అరవింద సమేత వీరరాఘవ ట్రయిలర్ బయటకు వచ్చింది. ఫ్యాన్స్ కావచ్చు, యాంటీ ఫ్యాన్స్ కావచ్చు, త్రివిక్రమ్ ఏంటీ? ఈ ఫైట్లు, ఈ హింస, ఈ మాస్ మసాలా ఏంటీ అంటూ డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. కానీ అసలు విషయం వేరు అని తెలుస్తోంది. సినిమా టోటల్ నిడివిలో అరగంట మాత్రమే ఈ బోయపాటి టైపు అరివీర హింస వుంటుదంట. అంటే ఫైట్లలో మాత్రమే. మిగిలిన సినిమా మాత్రం త్రివిక్రమ్ టైపులోనే వుంటుందని తెలుస్తోంది.

ఆ మిగిలినది కూడా సగం లవ్వబుల్ గా, జోవియల్ గా వుంటుందట. మిగిలిన సగం మాత్రం మెసేజ్ ఓరియెంటెడ్ గా, ఫ్యాక్షన్ జనాలను మాటలతో, మంచి తనంతో మార్చే వ్యవహారంగా వుంటుందట. అవన్నీ ట్రయిలర్ లోకి తీసుకువస్తే, ఫ్యాన్స్ జోష్ ఎలా వుంటుందో? అన్న ఆలోచనతో, ఈ విధంగా ట్రయిలర్ కట్ చేసినట్లు తెలుస్తోంది.

అంతా బాగానే వుంది. స్ట్రాటజీ ఓకె. కానీ ట్రయిలర్ ఇలా వుంటే ఓవర్ సీస్ బయ్యర్ కిందకు సినిమాను అమ్ముకోవడం అన్నది కాస్త కష్టం అవుతుంది. ఎందుకంటే ఓవర్ సీస్ ఆడియన్స్ హింస వున్న సినిమాలకు కాస్త దూరంగా వుంటారు. అ..ఆ సినిమాను త్రివిక్రమ్ సినిమాగా బాగా ఆదరించిన కారణం, ఆ స్టయిల్ ఓవర్ సీస్ కు నచ్చడమే.

అది తెలిసీ, ఇలా ట్రయిలర్ కట్ చేసారు అంటే, బహుశా సినిమా విడుదల అయిన తరువాత అసలు విషయం బయటకు వచ్చి, వాళ్లే ఆదరిస్తారనే ధీమా కావచ్చు.