థమన్ ప్రయాస వృధాయేనా?

అరవింద సమేత వీరరాఘవ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను అంతా తనదే అన్నంతగా కిందామీదా పడిపోయి చేసేసాడు సంగీత దర్శకుడు థమన్. ఫంక్షన్ ప్రారంభం కావడానికి ముందు టీవీల్లో హడావుడి అంతా థమన్ దే.…

అరవింద సమేత వీరరాఘవ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను అంతా తనదే అన్నంతగా కిందామీదా పడిపోయి చేసేసాడు సంగీత దర్శకుడు థమన్. ఫంక్షన్ ప్రారంభం కావడానికి ముందు టీవీల్లో హడావుడి అంతా థమన్ దే. ఇటీవల థమన్ కు పెద్ద సినిమాలు రావడం తగ్గిపోయింది. దేవీశ్రీప్రసాద్ కోట్లలో రెమ్యూనిరేషన్ తీసుకుంటూ వుంటే, థమన్ ఇంకా లక్షల్లోనే వున్నారు. 

అలాంటి టైమ్ లో కాస్త మీడియం హిట్ లు పలకరించడం ప్రారంభమైంది. త్రివిక్రమ్ కు దేవీశ్రీకి ఏక్కడో బెడిసింది. దాంతో ఆయన అనిరుధ్ ను, విక్కీ జే మేయర్ ను ట్రయ్ చేసారు. ఇప్పుడు థమన్ దగ్గరకు వచ్చారు. నాలుగు పాటల్లో మూడుపాటలు ఓకె అయినా, ఆల్బమ్ కోసం థమన్ తన పాటలు తానే కాపీ కొట్టాడని విమర్శలు వినిపించాయి. అది కాపీ కాదు, తన స్టయిల్ నే అంత అంటూ థమన్ వివరణ ఇచ్చాడు. 

ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఇంత హడావుడి చేసి, ఎలా మాట్లాడినా థమన్ కు ఇప్పట్లో కలిసి వచ్చేది ఏమీలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్టీఆర్ తరువాత సినిమాకు కీరవాణి ఫిక్స్. ఆ తరువాత సినిమాలు రెండింటికీ దేవీశ్రీ ప్రసాద్ నే వుంటాడు. ఎందుకంటే ఆ సినిమాల డైరక్టర్లు దేవీతో తప్పత మరొకరితో చేయరు. 

సో ఇక థమన్ కు వున్న ఆశ అంతా త్రివిక్రమ్ మాత్రమే. త్రివిక్రమ్ త్వరలో చేయబోయే బన్నీ సినిమా ఆ తరువాత చేసే వెంకీ సినిమాకు చాన్స్ దొరకవచ్చేమో? చూడాలి.