కాస్టింగ్ కౌచ్ పై శ్రీశక్తి పేరిట యుద్ధం చేస్తున్నానని తనకుతాను ప్రకటించుకున్న శ్రీరెడ్డి, ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులపై ప్రత్యక్షంగా, మరికొందరు స్టార్స్ పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈమె కోలీవుడ్ కు కూడా తన కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్ని విస్తరించింది. ఇప్పుడీమె నటుడు రాజేంద్రప్రసాద్ ను టార్గెట్ చేసింది.
“మా అసోసియేషన్ నుంచి 6 నెలల్లోనే ఎందుకు నువ్వు బయటకొచ్చావో అందరికీ తెలుసు. హీరోయిన్ మాళవిక ఎందుకు ఇండస్ట్రీ నుంచి తప్పుకుందో అందరికీ తెలుసు. నీ లైంగిక వాంఛ కోసం ఎంతమంది మహిళా ఆర్టిస్టుల్ని ఇరిటేట్ చేశావో అందరికీ తెలుసు.”
ఇలా రాజేంద్రప్రసాద్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఇక్కడితో ఆగకుండా అతడి వ్యక్తిగత విషయాల్ని కూడా ప్రస్తావించింది. రాజేంద్రప్రసాద్ కూతురు ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందో అందరికీ తెలుసంటూ విమర్శలు చేసింది. చివరికి నటి హేమ ఎందుకు రాజేంద్రప్రసాద్ తో ఫైట్ చేస్తుందో కూడా అందరికీ తెలుసంటోంది శ్రీరెడ్డి.
ఇలా అందరికీ తెలుసంటూ ప్రశ్నలు సంధించిన శ్రీరెడ్డి, వాటికి తను మాత్రం సమాధానాలు ఇవ్వలేదు. ఓ సీనియర్ నటుడిగా రాజేంద్రప్రసాద్ ను గౌరవిస్తానని, కానీ ఓ మనిషిగా అతడ్ని గౌరవించనని శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది.
మహిళలకు అస్సలు గౌరవం ఇవ్వని రాజేంద్రప్రసాద్ దగ్గర్లో ఎక్కడైనా పిచ్చాసుపత్రి ఉంటే వెళ్లి చూపించుకోవాలని సలహా ఇచ్చింది. త్వరలోనే రాజేంద్రప్రసాద్ కు బొమ్మ చూపిస్తామంటూ ఘాటుగా పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.
రాజేంద్రప్రసాద్ పై ఉన్నఫలంగా శ్రీరెడ్డి ఇలా విరుచుపడ్డానికి ఓ రీజన్ ఉంది. రీసెంట్ గా బేవార్స్ అనే సినిమా ఫంక్షన్ ఒకటి జరిగింది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన రాజేంద్రప్రసాద్ ఆ ఫంక్షన్ లో మాట్లాడుతూ.. “సినిమావాళ్లపై ఈమధ్య రకరకాలుగా ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొందరు. వాళ్లంతా దరిద్రులు” అనే కామెంట్ చేశాడు.
శ్రీరెడ్డి తాజా ఆరోపణలకు ఈ స్టేట్ మెంటే కారణమై ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు.