ఉన్నట్లుండి సడెన్ గా కింగ్ ఆఫ్ ది హిల్స్ అంటూ తన స్వంత బ్యానర్ ను ప్రకటించాడు హీరో విజయ్ దేవరకొండ. అంతే కాదు, ఈ బ్యానర్ నోటా తోనే మొదలవుతోంది కూడా. వాస్తవానికి విజయ్ అత్యంత సమీప బంధువు యాష్ రంగినేని అతగాడి కోసమే బిగ్ బెన్ మూవీస్ పేరిట బ్యానర్ స్టార్ట్ చేసారు. విజయ్ ను బలమైన స్టార్ ను చేయాలనే ఆయన రంగంలోకి దిగి, పెళ్లి చూపులు సినిమాను నిర్మించారు. అంతే కాదు, రాబోయే డియర్ కామ్రేడ్ ప్రాజెక్టు కూడా ఆయనదే. మైత్రీ మూవీస్ అందులో భాగస్వామిగా చేరింది.
అయితే ఆ బ్యానర్ వుండగానే విజయ్ స్వంత బ్యానర్ స్టార్ చేసారు. దీని వెనుక తన సినిమాలకు పారితోషికంతో పాటు లాభాల్లో వాటా తీసుకునే అయిడియా వుందని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ 'నోటా' సినిమాను ఎప్పుడో ఒప్పుకున్నారు. దానికి గాను ఆయనకు ముట్టిన పారితోషికం కోటి పాతికలక్షలు మాత్రమే అని తెలుస్తోంది.
కానీ ఇప్పుడు విజయ్ రేంజ్ వేరు. అందులో గీతగోవిందం తరువాత వస్తున్న సినిమా అందుకే విజయ్ కు నిర్మాత జ్ఞాన్ వేల్ రాజాకు పారితోషికం తో పాటు లాభాల్లో వాటా వంటి ఒప్పందం ఏదో కుదిరినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఓ బ్యానర్ ను స్టార్ట్ చేసి, నోటాకు లింక్ అప్ చేసినట్లు తెలుస్తోంది.
ఇకపై మహేష్ బాబు బ్యానర్ మాదిరిగా విజయ్ సినిమాకు కింగ్ ఆఫ్ హిల్స్ బ్యానర్ తోడవుతుంది అన్నమాట.