బయోపిక్ కు సంబంధించి, ఒక్కో లుక్ విడుదల చేస్తూ సినిమా బజ్ ను వెల్ ప్లాన్డ్ గా పెంచుకుంటూ వస్తున్నారు. ఇప్పటి వరకు బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ ఒరిజినల్ గెటప్ లోనే కనిపించారు. అయితే సినిమాలో దాదాపు అరవై గెటప్ లు వుంటాయని. అవన్నీ ఎన్టీఆర్ నటించిన రకరకాల పాత్రల గెటప్ లు.
ఇప్పడు అలాంటి గెటప్ ను ఒకదాన్ని రేపు అంటే గురువారం విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి బయోపిక్ ఓపెనింగ్ సమయంలో బాలయ్య దుర్యోధనుడి గెటప్ లో కనిపించారు. దాన్ని లెక్కలోకి తీసుకుంటే ఓ పౌరాణిక గెటప్ కూడా విడుదల చేసినట్లే.
రేపు ఓ లుక్ విడుదల చేస్తున్నాం అని యూనిట్ ప్రకటించింది. మరి ఆ లుక్ పౌరాణికమా? సాంఘికమా? అన్నది తెలియడం లేదు కానీ ఈ సారి వచ్చేది మాత్రం ఎన్టీఆర్ ధరించిన ఓ పాత్రలో లుక్ అని తెలుస్తోంది. కాదు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి గెటప్ లో వున్న లుక్ అని కూడా టాక్ వినిపిస్తోంది.
సినిమా విడుదల కు ఇంక 90 రోజులే సమయం వుంది. అందువల్ల ఇలా దఫదఫాలుగా ఒక్కో లుక్ విడుదల చేస్తూ సినిమాకు బజ్ పెంచే పనిని, పబ్లిసిటీని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.