బయోపిక్.. ఔనా.. నిజమేనా?

ఎన్టీఆర్ బయోపిక్ ను సినిమా, రాజకీయ వర్గీకరణతో రెండుభాగాలు చేయబోతున్నారని నెలల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే టాలీవుడ్ లో ఈ మేరకు సమాచారం సందడి మొదలైన సంగతీ వెల్లడించాం. వీటన్నింటిని…

ఎన్టీఆర్ బయోపిక్ ను సినిమా, రాజకీయ వర్గీకరణతో రెండుభాగాలు చేయబోతున్నారని నెలల క్రితం వెల్లడించిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే టాలీవుడ్ లో ఈ మేరకు సమాచారం సందడి మొదలైన సంగతీ వెల్లడించాం. వీటన్నింటిని పట్టుకుని చానెళ్లు స్టోరీలతో హడావుడి చేయడం ప్రారంభించాయి.

అయితే ఇప్పుడు బయోపిక్ అభిమానులకు మరో లేటెస్ట్ గ్యాసిప్. ఇది కూడా దాదాపు ఖాయంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలను ఎక్కువ గ్యాప్ లేకుండా రెండు వారాల తేడాతో విడుదల చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. 

మెయిన్ పార్ట్, జనాలకు ఆసక్తి వుండే ఎన్టీఆర్-సినీ నాయకుడును జనవరి 9న విడుదల చేస్తారు. జనాలకు తక్కువ ఆసక్తి వుండే, పొలిటికల్ డాక్యుమెంటరీ టైపు సంక్షేమ కార్యక్రమాల సినిమాను, జనవరి 25న విడుదల చేయాలని ఎన్బీకే ఫిలింస్ డిసైడ్ అయినట్లు టాలీవుడ్ ఇన్ సైడ్ సర్కిళ్లలో వినిపిస్తోంది. 

ఒక విధంగా ఇది రిస్క్ లాంటిదే. ఫస్ట్ పార్ట్ థియేటర్లలో వుండగానే రెండోపార్ట్ విడుదల చేసే ఆలోచన అంటే, ఎవరికి ఏది ఇష్టం అయితే అది చూస్తారనే ప్లానింగ్ కావచ్చు.