క్రేజీ రీమేక్ లో కియరా అద్వానీ

ఓవైపు  వివాదం నడుస్తున్నప్పటికీ, మరోవైపు శంకర్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. అపరిచితుడు హిందీ రీమేక్ కు సంబంధించి నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుంచి లీగల్ నోటీసు ఎదుర్కొన్నాడు శంకర్. ఓవైపు ఆ…

ఓవైపు  వివాదం నడుస్తున్నప్పటికీ, మరోవైపు శంకర్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నాడు. అపరిచితుడు హిందీ రీమేక్ కు సంబంధించి నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ నుంచి లీగల్ నోటీసు ఎదుర్కొన్నాడు శంకర్. ఓవైపు ఆ వివాదం నడుస్తుండగానే, మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానీని ఎంపిక చేశారు..

రణ్వీర్ సింగ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో రాబోతున్న అపరిచితుడు హిందీ రీమేక్ లో కియరా హీరోయిన్ గా నటించనుంది. ఈ మేరకు నిన్న అగ్రిమెంట్ కూడా పూర్తయినట్టు తెలుస్తోంది. రణ్వీర్ సింగ్, కియరా కాంబోలో ఇదే తొలి సినిమా కాబోతోంది.

మరోవైపు ఆస్కార్ రవిచంద్రన్ ఈ రీమేక్ కు సంబంధించి కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. అపరిచితుడు సినిమాకు సంబంధించి రచయిత సుజాత, తనకు పూర్తి హక్కులు రాశాడని.. ఆ కథ-మాటలన్నీ సుజాతవేనని వాదిస్తున్నాడు ఆస్కార్ రవిచంద్రన్. ఓ నిర్మాతగా సినిమాకు సంబంధించిన అన్ని హక్కులపై తనకు అధికారం ఉంటుందని అంటున్నాడు.

అటు శంకర్ మాత్రం సినిమా టైటిల్ లో కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వంలో కింద తన పేరు ఉందని చెబుతున్నాడు. కథ తనది కాబట్టి.. దాని స్ఫూర్తితో హిందీలో మరో వెర్షన్ తీసుకునే హక్కు తనకు ఉందంటున్నాడు. ఓవైపు ఈ వివాదం నడుస్తుండగా, మరోవైపు సినిమాలో హీరోయిన్ తో పాటు నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది.