హీరోయిన్..క్యూట్ పిక్చ‌ర్స్.. తెస్తాయా ఆఫ‌ర్స్!

ద‌క్షిణాదిన హీరోయిన్ గా ప్రయ‌త్నాలు సాగిస్తున్న సినీ ఫ్యామిలీ అమ్మాయిల్లో ఒక‌రు క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్. ఒక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి కూతురుగా, అదే స‌మ‌యంలో త‌ల్లి మాజీ హీరోయిన్ కావ‌డం.. ఈమెకు మంచి గుర్తింపును తెచ్చాయి.…

ద‌క్షిణాదిన హీరోయిన్ గా ప్రయ‌త్నాలు సాగిస్తున్న సినీ ఫ్యామిలీ అమ్మాయిల్లో ఒక‌రు క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్. ఒక ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి కూతురుగా, అదే స‌మ‌యంలో త‌ల్లి మాజీ హీరోయిన్ కావ‌డం.. ఈమెకు మంచి గుర్తింపును తెచ్చాయి. ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురుగా, ఒక‌నాటి హీరోయిన్ లిజి కూతురుగా క‌ల్యాణి త‌న వంతు ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈమె సినిమాలు చేసింది. ఇప్పుడు త‌న హోం ల్యాండ్ మ‌ల‌యాళంలో మ‌రో సినిమా చేస్తూ ఉంది. 

అయితే స‌రైన హిట్ లేక‌పోవ‌డంతో క‌ల్యాణి కెరీర్ కు ఊపు వ‌స్తున్న‌ట్టుగా లేదు. తెలుగులో క్రేజీ సినిమాల్లోనే న‌టించినా.. అవ‌కాశాలు మాత్రం వెల్లువెత్త‌డం లేదు. త‌మిళంలోనూ ప‌రిస్థితి కాస్త అటూ ఇటూగానే ఉంది. మూడు భాష‌ల్లోనూ క‌ల్యాణి త‌న ప్ర‌య‌త్నాలు సాగిస్తూ ఉంది. ఈ క్ర‌మంలో కొన్ని క్యూట్ పిక్స్ ను త‌న ఇన్ స్టాగ్ర‌మ్ అకౌంట్లో పోస్టు చేస్తూ ఉంది.

సాధార‌ణంగా యంగ్ హీరోయిన్లు గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను పోస్టు చేస్తూ ఉంటారు. అలా  అంద‌రినీ ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు. క‌ల్యాణి మాత్రం పూర్తి ట్రెడిషిన‌ల్ గా క‌నిపిస్తూ ఉంది. త‌న ముద్దు ముద్దు ఫొటోల‌ను పోస్టు చేస్తూ ఉంది. వీటిని చూస్తే ఈ అమ్మాయి ఈ త‌రం హీరోయిన్ అనిపించుకోక‌పోవ‌చ్చు. కానీ.. త‌న క్యూట్ నెస్ తో ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంది.  ఇక క‌ల్యాణి రెమ్యూన‌రేష‌న్ క‌థేంటి అంటే.. దాదాపు 35 ల‌క్ష‌ల వ‌ర‌కూ తీసుకుంటోంద‌ట ప్రియ‌ద‌ర్శ‌న్ కూతురు!

అయన స్క్రీన్ పైన కనిపిస్తే చాలు