కుస్తీ పట్లు పట్టే హీరో

డిఫరెంట్ కాన్సెప్ట్ వుంటే తప్ప, డైరక్టర్లు కథలు అల్లడంలేదు. హీరోలు సినిమాలు ఓకే చేయడంలేదు. ఎందుకంటే జనాలు సినిమాలు చూసే దృక్పధం మారింది ఇఫ్పుడు. అందుకే ఎక్కడ డిఫరెంట్ స్టోరీలు వున్నాయా? వైవిధ్యమైన కాన్సెప్ట్…

డిఫరెంట్ కాన్సెప్ట్ వుంటే తప్ప, డైరక్టర్లు కథలు అల్లడంలేదు. హీరోలు సినిమాలు ఓకే చేయడంలేదు. ఎందుకంటే జనాలు సినిమాలు చూసే దృక్పధం మారింది ఇఫ్పుడు. అందుకే ఎక్కడ డిఫరెంట్ స్టోరీలు వున్నాయా? వైవిధ్యమైన కాన్సెప్ట్ లు వున్నాయా? అని జనం జల్లెడ వేసి వెదుకుతున్నారు.

ఆర్ ఎక్స్ 100తో పెద్ద హిట్ కొట్టిన కార్తీకేయ ఆల్రెడీ తమిళ సీనియర్ నిర్మాత కలైపులి థాను కోసం ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హిప్పీ అనే ఈ సినిమాలో బాక్సర్ గెటప్ లో కార్తికేయ కనిపిస్తున్న స్టిల్స్ ఇప్పటికే బయటకు వదిలారు.

ఈ సినిమాతో పాటు ఇప్పుడు మరో సినిమా కూడా ఓకే చేసాడట. దాంట్లో కుస్తీ పోటీలు పట్టే కుర్రాడి పాత్రలో కార్తికేయ కనిపిస్తాడట. ఇందుకోసం కాస్త స్పెషల్ కోచింగ్ కూడా తీసుకోబోతున్నట్లు బోగాట్టా. రెండు మూడునెలలు కుస్తీ కసరత్తులు చేసిన తరువాత జనవరి నుంచి సినిమా స్టార్ట్ చేస్తారట. వెంకట చంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తాడట.