టాలీవుడ్లో ఇప్పుడు వినిపిస్తున్న జవాబు తెలియని లేటెస్ట్ ప్రశ్న ఒకటి ఉంది. నిర్మాత అశ్వినీదత్ కు బాలీవుడ్ బడా సంస్థ వయాకామ్ కు మధ్య కుదిరిన ఒప్పందం ఏమిటి అన్నదే ఆ ప్రశ్న. వయాకామ్ సంస్థ తొలిసారి దేవదాసు సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం వయాకామ్ సంస్థ దేవదాస్ ప్రాజెక్టును అవుట్ రేట్ గా కొనేసుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఎంతకు కొన్నది ఏ కండీషన్ మీద కొన్నది అన్నది ఎవరికీ తెలీదు. వాస్తవానికి దేవదాసు సినిమా నిర్మాత అశ్వినీదత్ సీడెడ్ ఏరియాకు మాత్రమే విక్రయించారు. మిగతా ఏరియాలు కేవలం అడ్వాన్స్ మీద తనమీద రిస్క్ ఉంచుకుని పంపిణీకి ఇచ్చారు. ఇలా ఇవ్వడానికి కారణం సిడి అమ్మిన తరువాత వయాకామ్ రంగంలోకి రావడమే అని తెలుస్తోంది.
ఇప్పుడు నిర్మాత అశ్వినీదత్ ఇక్కడ దేవదాస్ సినిమాని టోటల్గా వయాకామ్ తరఫున మ్యానేజ్ చేస్తున్నట్టుగా వినిపిస్తోంది. అయితే వయాకామ్ తో కుదిరిన ఒప్పందం మాత్రం కేవలం ఫ్యామిలీకి తప్ప మరెవరికి తెలియదని ఇండస్ట్రీలో డిస్కషన్ నడుస్తున్నాయి.
గతంలో టాలీవుడ్ లోకి రెండు మూడు భారీ బాలీవుడ్ సంస్థలు వచ్చి రకరకాల టర్మ్ ల మీద సినిమాలు తీసుకోవడం ఓవర్ఫ్లో కొనడం వంటివి చేశాయి. మరి వయా కామ్ ఏం చేస్తుందో తెలియాల్సి ఉంది.