త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న అరవింద సమేత వీరరాఘవ విడుదల డేట్ దగ్గరపడుతోంది. అక్టోబర్ 2న ప్రీరిలీజ్ ఫంక్షన్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. హెచ్ఐసిసిలో జరిగే ఈ ఫంక్షన్ చాలా భారీగా చేయాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో భరత్ అనే నేను, అజ్ఞాతవాసి ఫంక్షన్ లు చాలా భారీగా జరిగాయి. మళ్లీ ఆ లెవెల్ లో చేయాలని అరవింద యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ ఫంక్షన్ లో సంథింగ్ స్పెషల్ గా ఏం ఉంటే బాగుంటుంది అన్నదానిపై డిస్కషన్లు జరుగుతున్నట్టు భోగట్టా. సాధారణంగా సినిమా ఫంక్షన్లకు యాంకరింగ్ కామన్ అయితే అరవింద ఫంక్షన్ కు దర్శకుడు త్రివిక్రమ్ హీరో ఎన్టీఆర్ కీలకపాత్ర పోషించేలా యాంకర్ పాత్ర తక్కువ ఉండేలా ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందని డిస్కషన్లు జరుగుతున్నట్టు భోగట్టా.
వాస్తవానికి ఫంక్షన్లలో త్రివిక్రమ్ తన స్పీచ్ కాస్త వివరంగా మాట్లాడతారు.. మిగతా అంతా సైలెంట్ గా ఉంటారు. కానీ అరవింద ఫంక్షన్లో కాస్త యాక్టివ్ రోల్ తీసుకుంటే బాగుంటుందని త్రివిక్రమ్ కు సన్నిహితులు సలహా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఎలాగూ హుషారుగానే ఉంటారు. బిగ్ బాస్ నిర్వాహకుడిగా ఆయన ఓ రేంజ్ లో విజృంభించిన సంగతి అందరికీ తెలిసిందే.
ఒకవేళ త్రివిక్రమ్ ఎన్టీఆర్ కనుక యాక్టివ్ తీసుకుంటే అరవింద ఫంక్షన్ సూపర్ గా ఉండడం ఖాయం.