విజయ్ దేవరకొండ లేటెస్ట్ సినిమా నోటా. ఈ సినిమా విడుదల 25న అని ముందుగా ప్లాన్ చేశారు. అయితే ఈ ప్లానింగ్ ముందు చాలా మల్లగుల్లాలు నడిచాయి. అక్టోబర్ 18న విడుదల చేయాలని నిర్మాత జ్ఞానవేల్ రాజా చాలా ప్రయత్నించాడు. కానీ నిర్మాత దిల్ రాజు తదితరులు దానికి అడ్డంపడ్డారు. హలోగురూ ప్రేమకోసమే సినిమా విడుదల అక్టోబర్ 18న ఉండడమే అందుకు కారణమని అందరికీ తెలిసిందే.
అయితే ఆఖరి ప్రయత్నంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ లో పోల్ కూడా నిర్వహించాడు. అప్పుడు కూడా అధికశాతం జనాలు అక్టోబర్ 5వ తేదిన అనే ఓట్లు వేశారు. దీంతో అక్టోబర్ 5న విడుదలకు సై అనక తప్పలేదు. కానీ అక్టోబర్ 5న విడుదల చేయడం విజయ్ దేవరకొండకు అంతగా ఇష్టంలేదని ఇండస్ట్రీలో గుసగుసలు విపిస్తున్నాయి. అసలు ఈ పరిస్థితి అంతటికి దిల్ రాజు అండ్ కో కారణమని విజయ్ ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది.
దిల్ రాజు తదితరులు తనను నిర్మాతలు కూర్చోబెట్టి బలవంతంగా ఒప్పించారని విజయ్ అలిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నోటా సినిమా మీద కాస్త ఎక్కువ అంచనాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండకు నప్పే అగ్రెసివ్ క్యారెక్టర్ కావడం గీత గోవిందమ్ సినిమా తర్వాత విడుదల కావడం వంటి కారణాలతో ఈ సినిమాకు మంచి బజ్ ఉంది.
అందుకే నిర్మాత జ్ఞానవేల్ రాజా తను అనుకున్న రేటు రాకపోయినా స్వంతంగా విడుదల చేసుకుంటున్నారు. మరి ఐదో తేదీ డేట్ ఏ మేరకు కలిసివస్తుందో చూడాలి.