అర్జున్ రెడ్డి రీమేక్ బాలీవుడ్ లో ఆల్రెడీ సెట్స్ పైకి వచ్చేసింది. షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. హీరోయిన్ ను కూడా చాలారోజుల కిందటే ఫైనలైజ్ చేశారు. కానీ ఇప్పుడు సడెన్ గా ఆ భామను తీసేసి, ఆ స్థానంలో కైరా అద్వానీకి స్థానం కల్పించారు. తెలుగులో షాలినీ పాండే పోషించిన ప్రీతిషెట్టి రోల్ ను హిందీలో కైరా అద్వానీ పోషించనుంది. ఈ విషయాన్ని కైరా స్వయంగా ట్వీట్ చేసింది.
అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో హీరోయిన్ కోసం చాలా వెదికారు. ఫైనల్ గా తారా సుతారియా అనే బ్యూటీని ఫిక్స్ చేశారు. ఆమెతో వారంరోజుల ప్రిన్సిపల్ షూటింగ్ కూడా జరిగింది. కానీ అంతలోనే ఈ ప్రాజెక్టు నుంచి తారాను తొలిగిస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. పైకి కాల్షీట్ల సమస్య అని చెబుతున్నప్పటికీ తారాతో యూనిట్ కు ఏదో సమస్య ఎదురైనట్టుంది. అందుకే ఆఘమేఘాల మీద ఆమెను తీసేసి, ఆ స్థానంలో కైరా అద్వానీని పెట్టుకున్నారు.
స్టోరీ డిమాండ్ చేస్తే లిప్ కిస్సులకు ఎప్పుడూ రెడీ అంటూ కైరా అద్వానీ ఇప్పటికే స్టేట్ మెంట్ ఇచ్చింది. నెట్ ఫ్లిక్స్ రూపొందించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ లో ఆమె ఎంతలా రెచ్చిపోయి నటించిందో అందరికీ తెలిసిందే. దీంతో అర్జున్ రెడ్డి రీమేక్ కు కైరా రైట్ ఛాయిస్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పడుతున్నాయి.
తెలుగులో మహేష్ బాబు సరసన భరత్ అనే నేను సినిమా చేసింది కైరా. ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో నటిస్తున్నప్పటికీ ఆమె దృష్టి మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. ఎట్టకేలకు షాహిద్ సరసన ఓ మంచి ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసింది.