అచ్చెన్నకు ఫుల్ సపోర్ట్ అంటున్న వైసీపీ మంత్రి ?

అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. ఆయన తెల్లారిలేస్తే జగన్ మీద పెద్ద గొంతుతో విరుచుకుపడతారు. అయితే అచ్చెన్న తాజాగా అతి పెద్ద వివాదంలో కూరుకుపోయారు. Advertisement ఆయన ఒక టీడీపీ నేతతో మాట్లాడుతున్న వీడియో…

అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. ఆయన తెల్లారిలేస్తే జగన్ మీద పెద్ద గొంతుతో విరుచుకుపడతారు. అయితే అచ్చెన్న తాజాగా అతి పెద్ద వివాదంలో కూరుకుపోయారు.

ఆయన ఒక టీడీపీ నేతతో మాట్లాడుతున్న వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ఒక్క లెక్కన వైరల్ అవుతోంది. అందులో లోకేష్ గురించి, టీడీపీ భవిష్యత్తు గురించి అచ్చెన్నాయుడు అన్న మాటలు పసుపు పార్టీకి భారీ డ్యామేజిని కలిగించేలాగే ఉన్నాయి.

అయితే అచ్చెన్నాయుడు అది తప్పుడు వీడియో అంటూ ఓ వైపు ఖండిస్తున్నా టీడీపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు. ఆఫ్ ది రికార్డుగా చాలా మంది మనసులో మాటలనే అచ్చెన్న చెప్పారని కూడా మరో వైపు వినిపిస్తున్న మాట. దీని మీద అచ్చెన్నకు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ మద్దతు ప్రకటించారు.

అచ్చెన్న తప్పు ఏమీ మాట్లాడడలేదు. ఆయన లోకేష్ మీద చేసిన వ్యాఖ్యల్లో చాలా నిజమే ఉందని బొత్స చెప్పుకొచ్చారు. మొత్తానికి టీడీపీలో అచ్చెన్న వివాదం అలా రగులుతూండగానే ఆ మంటను మరింత పెద్దది చేశారు బొత్స.  

టీడీపీ వారికి కోపం వస్తే రావచ్చు కానీ అచ్చెన్న తప్పు ఏం మాట్లాడారు అని వైసీపీ నేతలు ఒక్కొక్కరూ వెనకేసుకురావడం విశేషమే.