రెండు లక్షల రూపాయల డబ్బు.. 12 తులాల బంగారం మాత్రమే.. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో దొరికినట్టుగా తెలుగుదేశం పార్టీ చెబుతోంది. ఐటీ ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసినట్టుగా తెలుగుదేశం వర్గాలు హోరెత్తిస్తూ ఉన్నాయి. మూడు రోజులుగా ఎక్కడిక్కడ ఉండిపోయిన పచ్చ పార్టీ నేతలు.. ఇప్పుడు మళ్లీ రొటీన్ స్టైల్లోకి వచ్చారు. ఒకరి తర్వాత మరొకరుగా స్పందిస్తూ ఉన్నారు. చంద్రబాబు దొరికిపోయారేమో అనే భావన కలిగినప్పుడు అంతా కలుగులో ఉండిపోవడం, ఆయన దొరకలేదేమో అనే ధీమా వచ్చాకా ఒక్కొక్కరు బయటకు వస్తున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం!
అయితే ఇక్కడ కామన్ సెన్స్ ఆలోచిస్తే కొన్ని డౌట్లు రానే వస్తాయి. అందులో ముఖ్యమైనది.. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై ఐటీ రైడ్స్ దాదాపు వారం రోజుల పాటు సాగాయి! ఒక వారాంతంతో మొదలుపెడితే మరో వారాంతం వరకూ ఆ రైడ్స్ కొనసగాయి! తొలి రోజే 150 కోట్ల రూపాయల వరకూ అక్రమాస్తులు బయటపడినట్టుగా, కోటి రూపాయల స్థాయిలో డబ్బు. అంతే స్థాయిలో బంగారం.. మిగతాదంతా డాక్యుమెంట్ల రూపంలో బయటపడినట్టుగా ప్రచారం జరిగింది. ఇప్పుడేమో జస్ట్ రెండు లక్షలు 12 తులాల బంగారం అంటున్నారు.. మరి రెండు లక్షల రూపాయల నగదును, పన్నెండు తులాల బంగారాన్ని పట్టుకోవడానికి ఐటీ వారం రోజులు రైడ్స్ నిర్వహించిందా?
భారత ఐటీ శాఖ రేంజ్ మరీ అంత సిల్లీగా ఉంటుందా? ఐటీ అధికారులు వారం రోజుల్లో శ్రీనివాస్ కు సంబంధించిన అన్ని చోట్లా రైడ్స్ నిర్వహించడానికి కూడా రెండు లక్షల రూపాయల పైనే ఖర్చు అయ్యి ఉంటుంది! రెండు లక్షల రూపాయలకు మించి దొరకని చోట అనే క్లారిటీ కూడా లేకుండానే ఐటీ రైడ్స్ జరిగి ఉంటాయా? ఐటీ అధికారులు మరీ అంత సిల్లీగా కనిపిస్తూ ఉన్నారా?
సరే.. ఐటీ అధికారులకు ఆ మాత్రం అవగాహన లేకుండానే శ్రీనివాస్ మీద పడ్డారనే అనుకుందాం. కానీ చంద్రబాబుకు ఈ మ్యాటర్ మీద అవగాహన ఉంటుంది కదా? శ‌్రీనివాస్ మీద పడ్డా ఏం దొరకదు అనే ధీమానే ఉంటే చంద్రబాబు నాయుడు తొలి రోజే మీడియా ముందుకు వచ్చేవారు కాదా? అలాంటి సందర్భంల్లో చంద్రబాబు నాయుడు మీడియా ముందు చేసే హల్చల్ మామూలుగా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గురువారమే హైదరాబాద్ కు వెళ్లిపోయినట్టుగా జరిగిన ప్రచారం మాటేమిటి? అక్కడ తర్జనభర్జనలు జరిగినట్టుగా జరిగిన ప్రచారం కథేంటి? ఇప్పటి వరకూ ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టలేదు? అయితే ఏపీ జనాలకు ఈ మాత్రం బుర్రలేదు అనే ఫీలింగ్ తో పచ్చబుకాయింపు సాగుతూ ఉందంతే!