Advertisement

Advertisement


Home > Movies - Movie News

సురేఖ‌తో పెళ్లి...చిరును బ‌లి ప‌శువు చేసిందా!

సురేఖ‌తో పెళ్లి...చిరును బ‌లి ప‌శువు చేసిందా!

మెగాస్టార్ చిరంజీవి, సురేఖ ఆద‌ర్శ దంప‌తులు. స‌ర‌దాలో ఇద్ద‌రూ ఇద్ద‌రే. వాళ్లిద్ద‌రి వైవాహిక జీవితానికి 40 ఏళ్లు. ఈ నెల 18న సురేఖ పుట్టిన‌రోజు, 20న వారిద్ద‌రి పెళ్లి రోజు. ఈ రెండు సంద‌ర్భాల‌ను పుర‌స్క‌రించుకుని చిరంజీవి, సురేఖ‌...సాక్షి ప‌త్రిక‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు.

ఈ సంద‌ర్భంగా త‌మ జీవితాల్లోని అనేక విశేషాల‌ను వారు పంచుకున్నారు. లేటు వ‌య‌సులో ప‌క్క చూపు చూడాల‌నే ఫీలింగ్ ఎందుకొస్తున్న‌దో కూడా చిరంజీవి మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు. ఇంతే కాదు అస‌లు సురేఖ‌ను పెళ్లి చేసుకోవ‌డం ద్వారా బ‌లిప‌శువు ఎలా అయ్యాడో కూడా ఆయ‌న స‌ర‌దాగా చెప్పుకొచ్చాడు. అలాగే చిరంజీవిని పెళ్లి చేసుకోవ‌డానికి సురేఖ చెప్పిన కార‌ణ‌మేంటో కూడా వివ‌రించారు.

శుభ‌లేఖ రాసుకున్న విశేషాల గురించి చెప్పాల‌ని చిరంజీవిని అడ‌గ‌డ‌మే ఆల‌స్యం...వెంట‌నే జ‌వాబు చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యాడాయన‌. ‘అంటే మీర‌డుగుతున్న‌ది నాకు నేనుగా బ‌లి ప‌శువును అయిన రోజు గురించేనా’ అని గ‌ట్టిగా న‌వ్వాడు చిరంజీవి. భ‌ర్త న‌వ్వుకు సురేఖ శృతి క‌లిపారు. త‌న క్లాస్‌మేట్ స‌త్య‌నారాయ‌ణ అనుకోకుండా ఒక‌రోజు చెన్నై కోడంబాకం బ్రిడ్జి మీద క‌నిపించ‌డం...త‌న జీవితంలో సురేఖ ప్ర‌వేశానికి కార‌ణ‌మైన‌ట్టు చెప్పాడు. త‌న క్లాస్‌మేట్‌కు అల్లు రామ‌లింగ‌య్య పెద‌నాన్న అవుతాడ‌ని, అత‌న్ని కారులో దిగ‌పెట్టేందుకు అల్లు వారింటికి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని చిరు నాటి రోజుల్ని గుర్తు తెచ్చుకున్నాడు.

అయితే అల్లు రామ‌లింగ‌య్య‌కు త‌న కూతురిని ఐఏఎస్ ఆఫీస‌ర్‌కి ఇవ్వాల‌ని కోరిక అని చిరంజీవి చెప్పాడు. కానీ అల్లు అర‌వింద్ బ‌ల‌వంతంతో త‌న గురించి విచారించార‌న్నాడు. వాళ్ల విచార‌ణ‌లో త‌న‌కు చెడు అల‌వాట్లు లేవ‌ని, ఆంజ‌నేయ‌స్వామి భ‌క్తుడిన‌ని, బాగా చ‌దువుకోవ‌డంతో పాటు బాగా క‌ష్ట‌ప‌డ‌తాన‌నే ఫీడ్ బ్యాక్ రావ‌డంతో అల్లు అర‌వింద్‌ కుటుంబం త‌న‌తో సురేఖ పెళ్లి చేయ‌డానికి నిశ్చ‌యించుకున్నార‌ని చిరంజీవి వివ‌రించాడు. కానీ ప‌ది మంది నిర్మాత‌ల‌ను త‌న గురించి అడిగి స‌ల‌హా తీసుకున్నాకే రామ‌లింగ‌య్య త‌మ పెళ్లికి ఓకే చెప్పాడ‌న్నాడు. ఆ విధంగా త‌న‌ను అల్లు వారి బుట్ట‌లో ప‌డేసిన‌ట్టు చిరంజీవి వివ‌రించాడు.

‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు అనుకున్నా. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుంటే బాగుంటుందనుకున్నా. అందుకే సరే అన్నా’ అని సురేఖ మ‌ధుర స్మృతుల‌ను నెమ‌రు వేసుకున్నారు.

పెళ్లి చూపుల‌ప్పుడు మమ్మల్ని మాట్లాడుకోమని పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లార‌ని, అయితే అంత‌కు ముందు అమ్మాయిల‌తో పెద్ద‌గా ప‌రిచ‌యాలు లేక‌పోవ‌డంతో కాస్త ఇబ్బంది ప‌డ్డాన‌ని చెప్పాడు. కానీ  సురేఖ పొందిక చూసి ‘ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అనుకున్నాను. మా అమ్మకి కూడా తను నచ్చింది. నాన్నగారైతే ‘ఏం కళరా ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకో’ అని అన్న‌ట్టు చిరంజీవి నాటి విశేషాల‌ను చెప్పుకుపోయాడు.

పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు త‌న చొక్కా చిరిగిపోయింద‌ని, సురేఖ మార్చుకోమంటే ‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అని, అలాగే కట్టేశాన‌న్నాడు. అయితే అప్పటికే త‌న‌కు ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్న అనుభవం ఉంద‌ని చెబుతూ దంప‌తులిద్ద‌రూ బిగ్గ‌ర‌గా న‌వ్వారు.

చిరంజీవి కుటుంబ స‌భ్యులంతా  త‌న‌తో చాలా బాగుంటారని చెప్పారు. ఏ రిలేషనయినా రెండువైపులా ఉండాల‌ని, చిరంజీవి లేక‌పోయినా కల్యాణ్‌ (పవన్‌ కల్యాణ్‌) ఎప్పుడూ పిల్లలతో ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. బాగా సరదాగా ఉండేవాడ‌ని, అందుకే కల్యాణ్‌ పిల్లలతోపాటు పెరిగాడని, పిల్లలు కల్యాణ్‌తో పాటు పెరిగాడ‌ని సురేఖ చెప్పారు.

తాను ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే సినిమా అవకాశాలు మొదలయ్యాయని, ఆల్బమ్‌ పట్టుకుని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదని చిరంజీవి చెప్పాడు. పెళ్లినాటికే ఫామ్‌లో ఉన్నాన‌ని, అప్పుడేమో తాను కనబడితే రేఖకి అపురూపమ‌న్నాడు.

కానీ మనవరాళ్లు వచ్చాక ఎఫెక్షన్‌ తగ్గింద‌ని సురేఖ‌పై ‘చిర్రు’ బుర్రులాడాడు. పలకరిస్తే ‘ఆ వస్తున్నా’ అంటుందే త‌ప్ప‌, వచ్చి చూడదని ఆయ‌న వాపోయాడు. అందుకేనేమో లేటు వయసులో చాలామంది సెకండ్‌  కోసం చూస్తుంటారని  నవ్వుతూ, సురేఖ వైపు కొంటెగా చూస్తూ ఆట ప‌ట్టించాడు. అయినా నేనా ధైర్యం చేయలేననే మాట‌ల‌తో ముగింపు ప‌లికాడు. సురేఖ న‌వ్వుతూ చిరు వైపు చూస్తూ ఉండిపోయారు. వాళ్ల సంభాష‌ణ‌ల్లో ఎక్క‌డా దాప‌రికం క‌నిపించ‌లేదు. అందుకే నాలుగు ద‌శాబ్దాల వైవాహిక జీవితంలో ఎలాంటి అర‌మ‌రిక‌లు లేకుండా సుఖ‌సంతోషాల‌తో జీవిస్తున్నార‌నిపించింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?