సీనియర్ హీరో బాలయ్య కు ఎప్పుడూ హీరోయిన్ల సమస్య వస్తుంటుంది. కానీ ఈసారి ఐటమ్ గర్ల్ సమస్య వచ్చింది.
గద్దల కొండ గణేష్, క్రాక్ సినిమాల్లో డింపుల్ ను చూసిన తరువాత ఆమెతో ఐటమ్ సాంగ్ అయితే బాగుంటుందని బాలయ్యనే స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేనికి సూచించినట్లు తెలుస్తోంది. ఖిలాడీ సినిమాలో నాచో మాన్ అంటూ వాత్స్యాయన భంగిమలు అన్నీ తెరపైనే చూపించేసింది డింపుల్.
మరి ఆ పాట చూసో లేక, ఆమె అయితే సినిమాకు గ్లామర్ టచ్ బాగుంటుందనో, డింపుల్ తో ఐటమ్ సాంగ్ చేయించమని గోపీచంద్ కు బాలయ్య సలహా ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ తాను ఐటమ్ సాంగ్ లు చేయనని, మంచి పాత్ర అయితేనే చేస్తానని డింపుల్ ఖరాఖండీగా చెప్పేసినట్లు తెలుస్తోంది.
దీంతో దర్శకుడు గోపీచంద్ డీలా పడి, ఆఖరికి మరెవరినైనా వెదికి పట్టుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. డింపుల్ చేతిలో ఇప్పుడు రెండు మూడు సినిమాలు వున్నాయి. ఖిలాడీ సినిమా మీద ఆశలు పెట్టుకుంది కానీ నెరవేరలేదు. ఆ సినిమా డిజాస్టర్ అయిపోయింది.