సరిగ్గా గత ఏడాది మార్చిలో రాజశేఖర్ సినిమా 'అర్జున' విడుదల కాబోతోందని ఒక ప్రకటన వచ్చింది. లాస్ట్ ఇయర్ లో మార్చి 15ని దాని విడుదల తేదీగా ప్రకటించారు. కన్మణి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పుడు విడుదల అవుతుందని ప్రకటించారు. విశేషం ఏమిటంటే.. 'అర్జున' త్వరలో విడుదల అంటూ ఇప్పుడు మళ్లీ ప్రకటనలు వస్తున్నాయి. ఏడాది కిందటే విడుదల అన్నారు. ఇప్పుడు మళ్లీ విడుదల అంటున్నారు. ఇంతకీ ఇది రెండో విడుదల? అంటే.. కాదట, అప్పుడు విడుదల కావాల్సింది, ఇప్పుడు విడుదల అవుతుందట!
వాస్తవానికి ఈ సినిమా రూపొంది చాలా కాలమే అయినట్టుగా ఉంది. అంటే గత ఏడాది విడుదల అని చేసిన ప్రకటనకు ముందు చాలా కాలం కిందటే ఈ సినిమా అంతా రెడీ అయ్యింది. ఈ సినిమా తొమ్మిదేళ్ల కిందటిది అంటే ఆశ్చర్యం కలగకమానదు. అప్పుడెప్పుడో ఈ సినిమా స్టార్ట్ అయ్యిందట, ఎప్పుడు పూర్తయ్యిందో ఎవరికి తెలీదు. విడుదల ప్రకటనలు మాత్రం ఏడాదికో మారు వస్తున్నాయి. గత ఏడాది కూడా తేదీ ని ప్రకటించారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సినిమా రూపొందిందని, అలా అప్పుడు ఎన్నికల హీట్ ను ఈ సినిమా ప్రచారానికి వాడుకున్నారు. చివరకు విడుదల మాత్రం జరగలేదు. అప్పుడే ఈ సినిమా విడుదల రాజశేఖర్ కు పెద్దగా ఇంట్రస్ట్ లేదట. ఇప్పుడు మళ్లీ ప్రకటనలు, తేదీలు.. ఇంతకీ ఈ సినిమా విడుదల అవుతుందా?