చైతూ కూడా ముద్దెట్టేసాడు

లిప్ టు లిప్ కిస్ అన్నది ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ ఫ్యాషన్. గీత గోవిందం సినిమా లైన్ నే దీనిచుట్టూ తిరిగేసింది. అసలే యూత్ ఫుల్ సినిమాలకు శ్రీకారం చుట్టిందే దర్శకుడు మారుతి. తన…

లిప్ టు లిప్ కిస్ అన్నది ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ ఫ్యాషన్. గీత గోవిందం సినిమా లైన్ నే దీనిచుట్టూ తిరిగేసింది. అసలే యూత్ ఫుల్ సినిమాలకు శ్రీకారం చుట్టిందే దర్శకుడు మారుతి. తన ఈ రోజుల్లో, బస్ స్టాప్ సినిమాలతో కొత్త జోనర్ చూపించాడు అప్పట్లో. అందుకే ఇప్పుడు తను కూడా ఈ లిప్ టు లిప్ స్టయిల్ ను అందేసుకున్నాడు.

శైలజారెడ్డి అల్లుడు సినిమాలో హీరో హీరోయిన్లు చైతన్య-అను ఇమ్మాన్యుయేల్ ల నడుమ ఒక లిప్ టు లిప్ కిస్ సీన్ లాగించేసినట్లు తెలుస్తోంది. అయితే మరీ అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100ల మాదిరిగా సెకెండ్లకు సెకెండ్లు జుర్రేసుకునే టైపులో కాకుండా, కాస్త క్లాస్ గా, లైట్ గా అలా అలా ఈ సీన్ ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

శైలజారెడ్డి అల్లుడు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ అండ్ రొమాన్స్ ట్రాక్  మీదనే నడుస్తుంది. అసలే ఇగోతో కిందామీదా అయిపోయే క్యారెక్టర్ హీరోయిన్ ది. ఆ ఇగో మొత్తం దిగిపోతుంది. ఈ లిప్ టు లిప్ వ్యవహారంతో అన్నమాట. చూడాలి ఈ సీన్ సినిమాలో ఎలా వుంటుందో?