లిప్ టు లిప్ కిస్ అన్నది ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ ఫ్యాషన్. గీత గోవిందం సినిమా లైన్ నే దీనిచుట్టూ తిరిగేసింది. అసలే యూత్ ఫుల్ సినిమాలకు శ్రీకారం చుట్టిందే దర్శకుడు మారుతి. తన ఈ రోజుల్లో, బస్ స్టాప్ సినిమాలతో కొత్త జోనర్ చూపించాడు అప్పట్లో. అందుకే ఇప్పుడు తను కూడా ఈ లిప్ టు లిప్ స్టయిల్ ను అందేసుకున్నాడు.
శైలజారెడ్డి అల్లుడు సినిమాలో హీరో హీరోయిన్లు చైతన్య-అను ఇమ్మాన్యుయేల్ ల నడుమ ఒక లిప్ టు లిప్ కిస్ సీన్ లాగించేసినట్లు తెలుస్తోంది. అయితే మరీ అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100ల మాదిరిగా సెకెండ్లకు సెకెండ్లు జుర్రేసుకునే టైపులో కాకుండా, కాస్త క్లాస్ గా, లైట్ గా అలా అలా ఈ సీన్ ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది.
శైలజారెడ్డి అల్లుడు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ అండ్ రొమాన్స్ ట్రాక్ మీదనే నడుస్తుంది. అసలే ఇగోతో కిందామీదా అయిపోయే క్యారెక్టర్ హీరోయిన్ ది. ఆ ఇగో మొత్తం దిగిపోతుంది. ఈ లిప్ టు లిప్ వ్యవహారంతో అన్నమాట. చూడాలి ఈ సీన్ సినిమాలో ఎలా వుంటుందో?