విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ వస్తోంది వైసీపీ. ఈ మేరకు అడ్డుకోవడానికి అన్ని రకాలైన ప్రయత్నాలు చేస్తామని చెబుతూ వచ్చింది.
ఈ రొజు జరిగిన విశాఖ కార్పొరేషన్ తొలి సమావేశంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం ద్వారా తన చిత్త శుద్ధిని వైసీపీ నిరూపించుకుంది.
తనకు తానుగానే వైసీపీ ముందుకు వచ్చి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో విశాఖ ప్రజల గొంతును వినిపించడం ఇక్కడ విశేషం. ఇదిలా ఉంటే తీర్మానం వైసీపీ చేసింది. వామపక్షాలు సైతం అదే దిశగా డిమాండ్ చేశాయి.
టీడీపీ మాత్రం హడావుడి బాగానే చేసిందని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఇదంతా తామే చేయిస్తున్నట్లుగా కార్పోరేటర్లు ర్యాలీగా వెళ్ళడమే అసలైన పాలిటిక్స్ మరి.