ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా వైసీపీ పై చేయినే సాధించినట్లుగా చెప్పుకోవాలి. స్థానిక ఎన్నికలు పెట్టండి అంటూ పెద్ద గొంతుతో గర్జించిన టీడీపీ సడెన్ గా అసలైన పరిషత్ ఎన్నికలను బాయ్ కాట్ చేసి పరువు తీసుకుంది అన్న విమర్శలు ఓ వైపు ఉన్నాయి.
దీంతో పరిషత్ ఎన్నికల ఫలితాలు ఏకపక్షమే అన్న మాట అయితే ఉంది. కొన్ని చోట్ల విపక్షాలు అన్నీ కలసి కొంత ప్రయత్నం చేసినట్లుగా ఉన్నా ఓవరాల్ గా మాత్రం వైసీపీదే అప్పర్ హ్యాండ్ అన్న మాట ఉంది.
దీని మీద వైసీపీ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ మాట్లాడుతూ పరిషత్ ఎన్నికలు అనే కాదు ఏ ఎన్నికలు ఏపీలో వచ్చినా కూడా వైసీపీదే విజయం అని క్లారిటీగా చెప్పేశారు.
జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పధకాలే తమకు శ్రీరామ రక్ష అని ఆయన అంటున్నారు. మొత్తానికి పంచాయతీలు, మునిసిపల్ పోల్స్ రిజల్టే రిపీట్ అవుతుంది అని ఆయన బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నారు.