మరో ‘సామజవరగమన’ వస్తుందా?

తమన్ కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది సామజవరగమన. సిద్ శ్రీరామ్ ఆలపించాడు ఈ పాటని. మరోసారి వీళ్లిద్దరూ కలిస్తే కచ్చితంగా సామజవరగమనతో కంపారిజన్ ఉంటుంది. అలాంటి కంపారిజన్ త్వరలోనే మొదలుకాబోతోంది. అవును……

తమన్ కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ గా నిలిచింది సామజవరగమన. సిద్ శ్రీరామ్ ఆలపించాడు ఈ పాటని. మరోసారి వీళ్లిద్దరూ కలిస్తే కచ్చితంగా సామజవరగమనతో కంపారిజన్ ఉంటుంది. అలాంటి కంపారిజన్ త్వరలోనే మొదలుకాబోతోంది. అవును… తమన్-సిద్ మరోసారి కలిశారు. ఈసారి పవన్ కల్యాణ్ హీరో.

పవన్ హీరోగా వస్తున్న వకీల్ సాబ్ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ పాటను సిద్ శ్రీరామ్ తో పాడించబోతున్నాడు తమన్. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. పవన్ సినిమాకు సంగీతం అందించడాన్ని తన జీవితాశయంగా చెప్పుకునే తమన్.. ఈసారి అతడి కోసం సిద్ తో కలిసి ఎలాంటి సాంగ్ కంపోజ్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

అల వైకుంఠపురములో తమన్-సిద్ శ్రీరామ్ కలిసి అదిరిపోయే డ్యూయట్ క్రియేట్ చేశారు. కానీ పవన్ సినిమాలో అలాంటి సందర్భం లేదు. ఎందుకంటే వకీల్ సాబ్ (పింక్ రీమేక్) అనేది ఓ డ్రై సబ్జెక్ట్. ఇంకా చెప్పాలంటే పవన్ కు హీరోయిన్ కూడా లేదు. ఇలాంటి సినిమాకు తమన్-సిద్ కలిసి ఎలాంటి ట్యూన్ అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

తాజా సమాచారం ప్రకారం.. తమన్-సిద్ కాంబో నుంచి ఈసారి ఓ మాంటేజ్ సాంగ్ రాబోతున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకుడు. మే 15న థియేటర్లలోకి రానుంది వకీల్ సాబ్.

థ్యాంక్ గాడ్ ఆమెను పెళ్లి చేసుకోలేదు