cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సమ్మర్ స్పెషల్ ఇదేనా?

సమ్మర్ స్పెషల్ ఇదేనా?

ప్రతి సమ్మర్ కు ఫ్యామిలీ ఫ్యామిలీ చూసే ఓ మూవీ కావాలి. ఈసారి సమ్మర్ కు బోల్డు సినిమాలు వస్తున్నాయి. వాటిల్లో అరణ్య ఒకటి. హాతీ మేరీ సాథీ పేరిట చాలా కాలంగా నిర్మాణంలో వున్న సినిమా ఇది. ప్రభు సోలమన్ దర్శకుడు. ఈ సినిమా టీజర్ వచ్చింది. చూడగానే ప్రభు సోలమన్ మార్క్ కనిపించింది. చాలా కాలం క్రితం గజరాజు అనే అస్సలు బజ్ లేకుండా తెలుగులోకి వచ్చి, పెద్ద హిట్ అయిన సినిమా అది.

అరణ్య సినిమాలో కూడా ఏనుగుల నేపథ్యంలో గట్టి కథే అల్లుకున్నట్లు కనిపిస్తోంది. కథలో కొత్త పాయింట్ వుంటుందా, వున్నట్లుందా? లేదా? అన్న సంగతి పక్కన పెడితే, టార్జాన్ మాదిరిగా బల్ దేవ్ పాత్రలో రానా భలేగా వున్నాడు. మూడు భాషల్లో తయారవుతున్న ఈ సినిమా కంటెంట్ ఎలా వుంటుందో తెలియదు కానీ,  టీజర్ చూస్తే మాత్రం కచ్చితంగా చూడాలనే ఆసక్తి కలిగించేలాగే వుంది.  బాహుబలి, నేనేనారు నేనే మంత్రి ని పక్కన పెడితే రానా నుంచి వస్తున్న సరైన సినిమా ఇధే అనుకోవాలేమో?

అన్ని భాషల తారలు నటిస్తున్న ఈ సినిమా మూడు నాలుగు భాషల్లో విడుదల కాబోతోంది. యూరోస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

 


×