ల‌వ్‌ సినిమా ఐతే మాత్రం…ఇంత‌ బ‌రితెగింపా?

ప్రేమ కాన్సెప్ట్‌తో తీసిన  సినిమా అంటే కాస్త ముద్దు, ముచ్చ‌ట్లు…మొత్తానికి మ‌సాలా ఉంటుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రీ బ‌రి తెగింపైతే ఎలా? స‌ర‌సాలు ఎక్కువైతే…ఛా ఛా, ఛీ ఛీ త‌ప్ప‌వ‌య్యా అని ఏదో తెలుగు…

ప్రేమ కాన్సెప్ట్‌తో తీసిన  సినిమా అంటే కాస్త ముద్దు, ముచ్చ‌ట్లు…మొత్తానికి మ‌సాలా ఉంటుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. మ‌రీ బ‌రి తెగింపైతే ఎలా? స‌ర‌సాలు ఎక్కువైతే…ఛా ఛా, ఛీ ఛీ త‌ప్ప‌వ‌య్యా అని ఏదో తెలుగు సినిమా పాట ఒక‌టుంది. దేనికైనా హ‌ద్దూ ప‌ద్దూ ఒక‌టుండాలి. అప్పుడే సినిమాకైనా, స‌మాజానికైనా మంచిది. అలా కాకుండా ‘అంతా మా ఇష్టం’ అని వ్య‌వ‌హ‌రిస్తే మాత్రం అస‌లుకే ఎస‌రు వ‌స్తుంది.

హ‌ద్దులు దాట‌డంతో  ‘లవ్‌ ఆజ్‌ కల్‌ 2’ సినిమాకు సెన్సార్ క‌త్తెర్లు వేయాల్సి వ‌చ్చింది. సైఫ్‌ అలీఖాన్‌ ముద్దుల తనయ సారా అలీ ఖాన్‌, యువ నటుడు కార్తీక్‌ ఆర్యన్‌లు నటిస్తున్న ‘లవ్‌ ఆజ్‌ కల్ 2’ ప్రేమికుల దినం పురస్క‌రించుకుని శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలో ఆ సినిమా సెన్సార్‌కు వెళ్లింది. సినిమాలోని కొన్ని దృశ్యాలు అభ్యంత‌క‌రంగా ఉండ‌టంతో సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది.

ప‌లు స‌న్నివేశాల‌పై సెన్సార్ బోర్డు కొర‌డా ఝుళిపించింది. సినిమాలో అభ్యంత‌ర‌క స‌న్నివేశాలు శృతిమించ‌డంతో తొల‌గించాల‌ని డైరెక్ట‌ర్‌కు సూచించింది. హీరో, హీరోయిన్ల  సంభాషణల్లోని అసభ్యకర మాటలను బీప్‌ చేయాలని సెన్సార్ బోర్డు ఆదేశించింది.  సారా, కార్తీక్‌ల మధ్య  కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించి.. మరికొన్నింటి నిడివిని తగ్గించింది.

 సారా, కార్తీక్‌ల ముద్దు సీన్‌ను కట్‌ చేయడంతోపాటు కొన్ని సీన్లను బ్లర్‌ చేసింది.  2009లో సైఫ్‌ అలీఖాన్‌, దీపికా నటించిన ‘లవ్‌ ఆజ్‌ కల్‌’కు ఈ చిత్రం సీక్వెల్‌గా తీశారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన ఇంతియాజ్‌ అలీనే ఈ చిత్రాన్ని తెరకెక్కించడం గ‌మ‌నార్హం. మొత్తానికి ఇది ‘ఎ’ స‌ర్టిఫికెట్ సినిమానా అనే అనుమానాలు త‌లెత్తుతున్నాయి. ల‌వ్‌ సినిమా ఐతే మాత్రం…ఇంత‌ బ‌రితెగింపా?

థ్యాంక్ గాడ్ ఆమెను పెళ్లి చేసుకోలేదు