cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సోలో..స్లోగన్ తో..తేజు

సోలో..స్లోగన్ తో..తేజు

చిత్రలహరి, ప్రతి రోజూ పండగే సినిమా ఇచ్చిన సంతృప్తికరమైన కెరీర్ తో హీరో సాయి ధరమ్ చేస్తున్న మరో సినిమా సోలో బ్రతుకే సో బెటరు. వాస్తవానికి ఇలాంటి కాన్సెప్ట్ తో స్టార్ట్ అయి ప్రేమలో పడే కథలు గతంలోనూ వినిపించాయి. కానీ అసలు ఈ కాన్సెప్ట్ ను ఉద్యమస్థాయికి తీసుకెళ్తూ, కథను ప్రారంభిస్తున్న సినిమా ఇదేనేమో? వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ వీడియో విడుదలయింది.

సినిమాలో సోలో బతుకు కాన్సెప్ట్ ను ఎంత బలంగా చెప్పబోతున్నారో అన్నది సూటిగా, సుత్తిలేకుండా చెప్పేసారు. ఉపన్యాసాలు లేకుండానే బలమైన ఆర్ఆర్ఆర్ వేసి, ఇంటెన్సివ్ లుక్ చూపిస్తూ, బ్యాక్ గ్రవుండ్ లో సోలో బతుకు బతికిన గొప్పోళ్లను చూపిస్తూ, మొత్తం సింపుల్ గా సూటిగా చెప్పేసారు. 

బోగవిల్లి ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్న ఈ సినిమాకు సుబ్బు అనే కొత్త దర్శకుడు పని చేస్తున్నారు. సమ్మర్ విడుదల దిశగా ఈ సినిమా రెడీ అవుతోంది. విశాఖలో కీలకమైన మూడు వారాల షెడ్యూలును ఇప్పుడే పూర్తి చేసుకుని, మలి షెడ్యూలుకు రెడీ అవుతోంది. సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.