cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మంచు నుంచి మరో బ్యానర్

మంచు నుంచి మరో బ్యానర్

మంచు మోహన్ బాబు ఇంటి నుంచి మరో బ్యానర్ వచ్చింది. ఇప్పటికే మోహన్ బాబు స్టార్ట్ చేసిన బ్యానర్, విష్ణు స్టార్ట్ చేసిన ఒకటి రెండు బ్యానర్లు, ఇలా చాలా వున్నాయి. ఇప్పుడు మంచు మనోజ్ కూడా ఒక బ్యానర్ స్టార్ట్ చేయడం విశేషం. పైగా ఈ బ్యానర్ కు నిర్మాతలుగా తన పేరుతో పాటు తమ తల్లి పేరు కూడా జోడించాడు. అంతే కాదు, చిత్ర సమర్పకురాలిగా సోదరి మంచు లక్ష్మి కుమార్తె పేరు పెట్టారు.

చిరకాలంగా సినిమాలకు దూరంగా వున్న మనోజ్ ఓ కొత్త దర్శకుడితో సినిమాను నిర్మించబోతున్నారు. టైటిల్ బాగుంది. అహం బ్రహ్మాస్మి అన్నది టైటిల్. శ్రీకాంత్ రెడ్డి దర్శకుడు. గత కొంత కాలంగా ఈ సినిమా మీద కసరత్తు జరుగుతోంది. ఇప్పటికి ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ వచ్చాయి. చిత్రమేమిటంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అంట. సూపర్ బజ్, హడావుడి వున్న మన సినిమాలు సైతం తమిళ, మలయాళ మార్కెట్ కోటి రూపాయలు మించడం లేదు. కన్నడంలో డబ్ చేస్తే కన్నా నేరుగా విడుదల చేస్తేనే కాస్త డబ్బులు వస్తున్నాయి. ఇక బాలీవుడ్ లో మన సినిమాలకు ఆదరణ ఎలా వుంటుందో సైరా లాంటి భారీ సినిమా నిరూపించింది.

ఇలాంటి టైమ్ లో మనోజ్ మరి పాన్ ఇండియా సినిమా అంటున్నాడు. ఆ సంగతి ఎలా వున్నా, మంచి సినిమా చేసి, మళ్లీ లైమ్ లైట్ లోకి మనోజ్ వస్తాడేమో? చూడాలి. యంగ్ హీరోలు ఎంత మంది వచ్చినా టాలీవుడ్ లో కావాల్సినంత చోటుంది. ఎటొచ్చీ ప్రూవ్ చేసుకోవాలంతే.

 గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై 'చావుకబురు చల్లగా'

 


×