సోషల్ మీడియా సత్తా తేలుతుంది

ఈవారం విడుదలవుతున్న మూడు సినిమాల్లో రెండింటికి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇంతా అంతా కాదు. సాంప్రదాయ ప్రచారాన్ని పక్కనపెట్టి, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నాయి కేరాఫ్ కంచరపాలెం,…

ఈవారం విడుదలవుతున్న మూడు సినిమాల్లో రెండింటికి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇంతా అంతా కాదు. సాంప్రదాయ ప్రచారాన్ని పక్కనపెట్టి, సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్స్ నే నమ్ముకుని ముందుకు వెళ్తున్నాయి కేరాఫ్ కంచరపాలెం, మను సినిమా యూనిట్ లు.

కేరాఫ్ కంచరపాలెం సినిమాను హీరో రానా కొనడంతో, దాదాపు ఇండస్ట్రీ సెలబ్రిటీలు అంతా ఈ సినిమా ప్రమోషన్ ను తమ చేతుల్లోకి తీసుకున్నారు. వాళ్లంతా సోషల్ నెట్ వర్క్ లో చేసిన హంగామా ఇంతా అంతా కాదు. తెలుగులో ఇదో అద్భుతం, అపూర్వం అని బజ్ క్రియేట్ చేసారు. మరి ఆ బజ్ లెక్కలకు తగినట్లు టికెట్ లు తెగుతాయో లేదో చూడాలి. సెలబ్రిటీలు సినిమా ప్రొమోషన్ ను తమ భుజాన ఈ రేంజ్ లో వేసుకుంటే ఓపెనింగ్స్ కుమ్మేయాలి మరి.

మను సినిమాను కూడా కాస్త డిఫరెంట్ సినిమాగా ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇదో మేధావి వర్గ సినిమా, ఇలాంటి ప్రయత్నం, ఇలాంటి సినిమా కచ్చితంగా రేర్ అనే విధంగా ప్రమోట్ చేసారు. కచ్చితంగా తెలుగు సినిమా స్థాయిని మను సినిమా పెంచుతుందనే ఫీలింగ్ కలిగించారు.

పైగా కేరాఫ్ కంచరపాలెం, మను సినిమాలను ముందుగానే దాదాపు చాలామందికి చూపించేసారు. కేరాఫ్ కంచరపాలెం అయితే దాదాపు మూడునెలల ముందు నుంచి ఇండస్ట్రీ జనాలు విడతలు విడతలుగా చూస్తూనే వున్నారు.

మను సినిమాను కూడా రెండురోజుల ముందే రెండు షోలు వేసేసారు. ఇదంతా ఈ రెండు సినిమాల కాన్పిడెన్స్ ను చాటి చెబుతుంది. మరి ఈ షోషల్ నెట్ వర్క్ ప్రచారం, సినిమాల ప్రీమియర్ టాక్ లు అన్నీకలిసి, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల రేంజ్ ఏ రేంజ్ కు చేరుస్తాయో చూడాలి.

ఇదిలా వుంటే వీటితో పాటు, కుందేలు-తాబేలు స్టయిల్ లో అన్నట్లుగా, రెగ్యులర్ కామెడీ ఫార్మాట్ లో, సాంప్రదాయబద్దమైన ప్రచారంతో, తన దోవ తనది అన్నట్లు వస్తోంది. సిల్లీ ఫెలోస్. సునీల్-అల్లరినరేష్ లతో తయారవుతున్న సినిమాపై రెండింటికి ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.