విజయ్ దేవరకొండ టాలీవుడ్ లేటెస్ట్ యూత్ సెన్సేషన్. దాదాపు మూడు వారాలుగా బాక్సాఫీస్ ను గీతగోవిందం సినిమాతో కొల్లగొడుతున్న విజయ్ ఇప్పుడు మరో సినిమా ట్రయిలర్ ను వదలబోతున్నాడు. విజయ్ దేవరకొండ తొలిసారి తెలుగు-తమిళ భాషల్లో చేస్తున్న సినిమా 'నోటా'. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తయారవుతున్న ఈ సినిమా దాదాపు మరో నెలరోజుల్లో సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా ట్రయిలర్ ను రేపు వదులుతున్నారు.
అయితే ట్రయిలర్ కు ముందుగా ఓ పైలట్ ఎపిసోడ్ ను వదిలారు. చూస్తుంటే కచ్చితంగా విజయ్ దేవరకొండ మరోసారి వైవిధ్యమైన సబ్జెక్ట్ ను తీసుకున్నట్లు కనిపిస్తోంది. ది రౌడీ..ది పొలిటీషియన్..ది లీడర్ అంటూ వితవుడ్ డైలాగ్, ఓన్లీ ఆర్ ఆర్ తో ఈ పైలట్ ఎపిసోడ్ ను కట్ చేసారు. ఇది కచ్చితంగా ఆకట్టుకునేలా వుంది. విజయ్ దేవర కొండను యాంగ్రీ యంగ్ మాన్ గా చూసారు, మిడిల్ క్లాస్ అబ్బాయిగా చూసారు. ఇప్పుడు పక్కగా ఓ పొలిటికల్ జెంటిల్ మన్ లా కనిపిస్తున్నాడు.
జ్ఞాన్ వేల్ రాజా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కృష్ణా, వెస్ట్, ఈస్ట్ హక్కులను గీతా ఫిలింస్ తీసుకుంది కూడా.